‘పోచారం’.. ఇక పర్యాటకం! | - | Sakshi
Sakshi News home page

‘పోచారం’.. ఇక పర్యాటకం!

Feb 9 2026 7:28 AM | Updated on Feb 9 2026 7:28 AM

‘పోచారం’.. ఇక పర్యాటకం!

‘పోచారం’.. ఇక పర్యాటకం!

నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): పోచారం ప్రాజెక్టు వద్ద పర్యాటక పనుల నిర్వహణకు మోక్షం కలిగింది. ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు కృషితో నిధుల మంజూరుకు మార్గం సుగమం అయ్యింది. ప్రభుత్వం రూ.3 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో ప్రాజెక్టు వద్ద బోటింగ్‌ సౌకర్యం కల్పించడంతోపాటు గెస్ట్‌హౌస్‌ను నిర్మించనున్నారు. ప్రాజెక్టు వద్ద యాక్సెస్‌ రోడ్ల నిర్మాణంతోపాటు పిల్లల ఆట పరికరాలను ఏర్పాటు చేయనున్నారు.

నెరవేరనున్న కల..

నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రాజెక్టును పర్యాటకంగా అభివృద్ధి పర్చాలని మండల ప్రజలతోపాటు జిల్లాలోని పలు ప్రాంతాల ప్రజలు కోరుకుంటున్నారు. వారాంతపు సెలవులతోపాటు పండగల వేళ కామారెడ్డి, మెదక్‌ జిల్లాలతోపాటు హైదరాబాద్‌, సంగారెడ్డి, సిద్దిపేట, నిజామాబాద్‌ జిల్లాల నుంచి వందల సంఖ్యలో పర్యాటకులు ప్రాజెక్టు వద్దకు తరలివస్తారు. ప్రాజెక్టు అలుగుపై నుంచి కిందకు జాలువారే నీటిలో తడుస్తూ ఉత్సాహంగా గడుపుతారు. వన్యప్రాణుల సంరక్షణ కేంద్రానికి చేరుకొని అందులోని వన్యప్రాణుల సందడిని ఆస్వాదిస్తారు. కాగా, ప్రాజెక్టులో విహరించేందుకు బోటింగ్‌ సౌకర్యం లేకపోవడంపై సందర్శకులు నిరాశకు లోనవుతున్నారు. బాత్‌రూం, టాయ్‌లెట్స్‌ లాంటి కనీస సౌకర్యాలు లేక తీవ్రఇబ్బందులు పడుతున్నారు.

ప్రాజెక్టు వద్ద పనుల నిర్వహణకు

రూ.3 కోట్లు మంజూరు

బోటింగ్‌ సౌకర్యం, గెస్ట్‌హౌస్‌

నిర్మాణంతోపాటు పిల్లల ఆట

పరికరాల ఏర్పాటుకు సన్నాహాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement