అభివృద్ధి చేసిన వారికే పట్టం కట్టండి
● ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ
కామారెడ్డి టౌన్: కామారెడ్డిని అభివృద్ధి చేసిన వారికే పట్టం కట్టాలని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఓ టర్లను కోరారు. గురువారం ఆయన జిల్లా కేంద్రంలో ని 3, 4, 5, 8, 26, 27, 29, 30, 31 వార్డులలో కాంగ్రెస్ అభ్యర్థులతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కొత్త వాగ్దానాలు చేసే వారిని నమ్మవద్దన్నారు. ‘మేము కామారెడ్డిలో చేసిన అభివృద్ధిని కళ్లముందు ఉంచి ఓట్లు అడుగుతున్నాం. రెండేళ్లుగా ప్రజలకు ముఖం చాటేసిన నాయకులు ఇప్పుడు మళ్లీ ఓట్ల కోసం వస్తున్నారు. కులమతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయం చేసే వారికి ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి‘ అని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే, పట్టణానికి నిధులు తీసుకురావడంలోనూ, అభివృద్ధి పనులను పర్యవేక్షించడంలోనూ తానే స్వయంగా పూచీకత్తుగా ఉంటానని హామీ ఇచ్చారు.


