విధులను బహిష్కరించిన న్యాయవాదులు
కామారెడ్డి టౌన్: చేవెళ్ల బార్ అసోసియేషన్ సభ్యురాలు, న్యాయవాది స్వప్న దారుణ హత్యను నిరసిస్తూ జిల్లా కేంద్రంలో న్యాయవాదులు గురువారం విధులు బహిష్కరించారు. కోర్టు పనులకు దూరంగా ఉండి, నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. నిందితుడితో పాటు ఈ హత్య వెనుక ఉన్న సూత్రధారులందరినీ గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నంద రమేష్ మాట్లాడుతూ.. న్యాయం కోసం పోరాడే న్యాయవాదులపై దాడులు జరగడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయవాదుల రక్షణ చట్టంను అమలు చేయాలని కోరారు. న్యాయవాదులు నరేందర్ రెడ్డి, గోవింద రావు, జగన్నాథం, వెంకటరామిరెడ్డి, భిక్షపతి, శ్రీధర్, లత రెడ్డి, నరేష్ కుమార్, మాయ సురేష్ తదితరులు పాల్గొన్నారు.
ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు గురువారం విధులను బహిష్కరించారు. రంగారెడ్డి జిల్లా చేవేళ్లలో న్యాయవాది హత్య ఘటనను నిరసిస్తు నిరసన చేపట్టారు. న్యాయవాదులు గోపాల్‌రావు, శ్రీనివాస్, శ్రీకాంత్, సాయిబాబా, సాయిప్రకాష్ దేశ్‌పాండే, నవీద్ తదితరులున్నారు.
విధులను బహిష్కరించిన న్యాయవాదులు


