నిన్నటి దోస్తులు.. నేడు ప్రత్యర్థులు
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. నిన్నటి మిత్రులు నేడు ప్రత్యర్థులుగా తలపడాల్సి రావొచ్చు. కామారెడ్డి మున్సిపల్ కౌన్సిలర్లుగా పనిచేసిన ముప్పారపు ఆనంద్, కుంబాల రవియాదవ్ మంచి దోస్తులు. ఒకప్పుడు ఇద్దరూ బీజేపీలో యువనేతలుగా గుర్తింపు పొందారు. తర్వాత ఇద్దరూ బీఆర్‌ఎస్‌లో పనిచేశారు. మారిన రాజకీయ సమీరణల మూలంగా ఇప్పుడు ఇద్దరు వేర్వేరు పార్టీల్లో కొనసాగుతున్నారు. పట్టణంలో జనరల్ స్థానమైన 33 వ వార్డులో బీఆర్‌ఎస్ అభ్యర్థిగా కుంబాల రవియాదవ్ పోటీ చేస్తుండగా.. అదే వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ముప్పారపు ఆనంద్ బరిలో ఉన్నారు. నిన్న మొన్నటి దాకా కలిసి ఉన్న ఇద్దరు మిత్రులు ఇప్పుడు ఎన్నికల బరిలో నిలిచి ప్రత్యర్థులుగా మారిపోయారు.
– సాక్షి ప్రతినిధి, కామారెడ్డి
ముప్పారపు ఆనంద్,
కాంగ్రెస్ అభ్యర్థి
కుంబాల రవియాదవ్,
బీఆర్‌ఎస్ అభ్యర్థి
నిన్నటి దోస్తులు.. నేడు ప్రత్యర్థులు


