అప్పట్లో నామినేటెడ్ చైర్మన్!
● 1956 నుంచి 1969 వరకు బల్దియాగా ఎల్లారెడ్డి
● 13 ఏళ్లూ నామినేటెడ్ చైర్మన్ పాలనే!
ఎల్లారెడ్డి మున్సిపాలిటీ కార్యాలయ భవనం
ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి పట్టణం గతంలోనూ మున్సిపాలిటీగా ఉంది. 1956 లోనే మున్సిపాలిటీగా మార్చారు. 1969 వరకు కొనసాగింది. తర్వాత ఎల్లారెడ్డిని పంచాయతీ చేశారు. తిరిగి 2018 లో రెండోసారి మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ అయ్యింది.
నిజాం పాలనలో జమాబంది(పన్నుల వసూళ్లు) కోసం ఎల్లారెడ్డి తహసిల్ కార్యాలయం ప్రధాన కేంద్రంగా ఉండేది. అప్పట్లో పెద్దపెద్ద అధికారులు ఇక్కడ ఉండేవారని చెబుతారు. అధికారుల కార్యకలాపాలకు ముఖ్య కేంద్రంగా ఉన్న ఎల్లారెడ్డిని 1956లో మున్సిపాలిటీగా మార్చారు. అప్పట్లో ఎన్నికలు కాకుండా ప్రభుత్వం చైర్మన్‌ను నామినేట్ చేసేది. అలా ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్‌గా ప్రముఖ న్యాయవాది మైసన్ వకీల్‌ను నియమించింది. ఆయన 1956 నుంచి 1969 వరకు ఈ పదవిలో కొనసాగారు. మున్సిపాలిటీ కావడం వల్ల ప్రజలపై పన్నులభారం ఎక్కువగా ఉందన్న కారణంతో 1969లో ఎల్లారెడ్డిని గ్రామ పంచాయతీగా మార్చారు. తిరిగి గత ప్రభుత్వం 2018 ఆగస్ట్ 2న ఎల్లారెడ్డి మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేసింది.


