పోలింగ్‌ కేంద్రాలపై పోలీసుల నిఘా | - | Sakshi
Sakshi News home page

పోలింగ్‌ కేంద్రాలపై పోలీసుల నిఘా

Feb 6 2026 7:55 AM | Updated on Feb 6 2026 7:55 AM

పోలింగ్‌ కేంద్రాలపై పోలీసుల నిఘా

పోలింగ్‌ కేంద్రాలపై పోలీసుల నిఘా

పోలింగ్‌ కేంద్రాలపై పోలీసుల నిఘా మున్సిపాలిటీల వారీగా సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు..

ఎన్నికల నిబంధనలు పాటించాలి

మున్సిపాలిటీల వారీగా సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు..

ఎన్నికలను ప్రశాంతంగా

నిర్వహించేందుకు చర్యలు

111 సమస్యాత్మక కేంద్రాలలో

ప్రత్యేక ఏర్పాట్లు

కామారెడ్డి టౌన్‌: మున్సిపల్‌ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీసు శాఖ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా గుర్తించిన సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తోంది. ఈనెల 11న మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ నిర్వహించనున్నారు. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల పరిధిలో ఉన్న పోలింగ్‌ కేంద్రాల వర్గీకరణ పూర్తయ్యింది. జిల్లాలో మొత్తం 239 పోలింగ్‌ స్టేషన్లు ఉండగా.. అందులో దాదాపు సగం కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. వీటిని సమస్యాత్మక, అతి సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక కేంద్రాలుగా వర్గీకరించారు. సమస్యాత్మక కేంద్రాల వద్ద అదనపు బలగాలను మోహరించడంతో పాటు, వెబ్‌ కాస్టింగ్‌, వీడియోగ్రఫీ ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్లాన్‌ చేస్తున్నారు. గొడవలకు ఆస్కారం ఉన్న ప్రాంతాల్లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి, ఓటర్లు స్వేచ్ఛగా ఓటు వేసేలా చర్యలు తీసుకుంటున్నారు.

మున్సిపాలిటీ మొత్తం సమస్యాత్మకం అతి అత్యంత

పోలింగ్‌ కేంద్రాలు సమస్యాత్మకం సమస్యాత్మకం

కామారెడ్డి 152 9 20 24

ఎల్లారెడ్డి 24 2 0 12

బాన్సువాడ 39 8 2 19

బిచ్కుంద 24 2 0 13

మొత్తం 239 21 22 68

మున్సిపల్‌ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించడమే లక్ష్యంగా సాగుతున్నాం. సమస్యాత్మక కేంద్రాల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నాం. ఎవరైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదు. ప్రతి ఒక్కరూ ఎన్నికల నిబంధనలు పాటించాలి. లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. – రాజేశ్‌ చంద్ర, ఎస్పీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement