నాలుగు జంటలు.. ఎనిమిది వార్డులు
గెరిగంటి లక్ష్మీనారాయణ, స్వప్న(బీఆర్‌ఎస్), కామారెడ్డి
కందూరి చంద్రశేఖర్, రేణుక(సీపీఎం), కామారెడ్డి
షేక్ జుబేర్, పర్వీన్ బేగం
(బీఆర్‌ఎస్), బాన్సువాడ
చంద్రశేఖర్‌గౌడ్, కవిత
(బీజేపీ), బాన్సువాడ
ఎన్నికల బరిలో భార్యాభర్తలు
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : ఒక్కోసారి రిజర్వేషన్లు కలిసిరాక పోటీ చేసే అవకాశాలు దూరమవుతుంటాయి. రిజర్వేషన్లు కలిసొచ్చినా టికెట్టు ఆశించే వారి సంఖ్య ఎక్కువ ఉండి అవకాశం కోల్పోతుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో ఒకే కుటుంబంలో ఇద్దరికి, అది కూడా భార్యభర్తలకు అవకాశాలు దక్కుతుంటాయి. ఇప్పుడు జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో కామారెడ్డి, బాన్సువాడ మున్సిపాలిటీలలో నాలుగు జంటలకు ఎన్నికల బరిలో దిగే అవకాశం దక్కింది.
కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డు నుంచి పోటీ చేస్తున్న సీపీఎం అభ్యర్థి రేణుక, 8వ వార్డునుంచి బరిలో ఉన్న అదే పార్టీ అభ్యర్థి చంద్రశేఖర్ భార్యాభర్తలు. వీరిద్దరు గతంలో కౌన్సిలర్లుగా పనిచేశారు.
బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన గెరిగంటి లక్ష్మీనారాయణ 46వ వార్డు నుంచి, ఆయన భార్య స్వప్న 47వ వార్డు నుంచి పోటీ చేస్తున్నారు. స్వప్న గత కౌన్సిల్‌లోనూ సభ్యురాలు.
బాన్సువాడ మున్సిపాలిటీలో మొన్నటివరకు వైస్ చైర్మన్‌గా కొనసాగిన బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన షేక్ జుబేర్ ఈసారి 2వ వార్డునుంచి పోటీ చేస్తుండగా.. ఆయన భార్య పర్వీన్ 17వ వార్డునుంచి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
బాన్సువాడలో మరో జంట బీజేపీ నుంచి పోటీ చేస్తోంది. చంద్రశేఖర్‌గౌడ్ 13వ వార్డు నుంచి, ఆయన భార్య కవిత 14వ వార్డు నుంచి బరిలో ఉన్నారు. కవిత ఒక పర్యాయం ఎంపీటీసీగా పనిచేశారు.
నాలుగు జంటలు.. ఎనిమిది వార్డులు
నాలుగు జంటలు.. ఎనిమిది వార్డులు
నాలుగు జంటలు.. ఎనిమిది వార్డులు


