క్రీడలతో మానసికోల్లాసం
కామారెడ్డి క్రైం: క్రీడలతో మానసికోల్లాసం లభిస్తుందని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. జిల్లా స్థాయి చీఫ్ మినిస్టర్స్ కప్ 2025 జిల్లాస్థాయి క్రీడలను కామారెడ్డిలోని ఇందిరాగాంధీ స్టేడియంలో కలెక్టర్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడలు యువతలో శారీరక దృఢత్వం, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని అన్నారు. చీఫ్ మినిస్టర్స్ కప్ వంటి పోటీలు గ్రామీణ, పట్టణ ప్రాంతాల యువతకు తమ ప్రతిభను చాటుకునే వేదికగా నిలుస్తాయని పేర్కొన్నారు. జిల్లాలోని ప్రతిభావంతులైన క్రీడాకారులు రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించి, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. అదనపు కలెక్టర్ విక్టర్, ఆర్డీవో వీణ, తహసీల్దార్ జనార్దన్, క్రీడల శాఖ అధికారి వెంకటేశ్వర్లుగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
కబడ్డీ విజేత ఎల్లారెడ్డి
కామారెడ్డి అర్బన్: సీఎం కప్ జిల్లా స్థాయి క్రీడాపోటీల్లో ఖోఖో బాలికల విభాగంలో కామారెడ్డి నియోజకవర్గం జట్టు ప్రథమ, ఎల్లారెడ్డి నియోజకవర్గం ద్వితీయ స్థానం పొందాయి. ఖోఖో బాలుర విభాగంలో జుక్కల్ నియోజకవర్గం ప్రథమ, ఎల్లారెడ్డి ద్వితీయ స్థానం పొందాయి. కబడ్డీ మహిళల విభాగంలో బాన్సువాడ ప్రథథమ, కామారెడ్డి ద్వితీయ స్థానం పొందాయి, కబడ్డీ పురుషుల విభాగంలో ఎల్లారెడ్డి ప్రథమ, జుక్కల్ ద్వితీయ స్థానం పొందాయి. వాలీబాల్ బాలికల విభాగంలో కామారెడ్డి ప్రథమ, బాన్సువాడ ద్వితీయ, బాలుర విభాగంలో బాన్సువాడ ప్రథమ, ఎల్లారెడ్డి ద్వితీయ స్థానాలు పొందాయి. విజేతలకు అడిషనల్ కలెక్టర్ మధుమోహన్ కప్‌లను అందజేశారు.
క్రమశిక్షణ, నాయకత్వ
లక్షణాలు పెంపొందుతాయి
కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
చీఫ్ మినిస్టర్స్ కప్ –2025
జిల్లాస్థాయి క్రీడల ప్రారంభం
క్రీడలతో మానసికోల్లాసం
క్రీడలతో మానసికోల్లాసం


