ఎల్లారెడ్డిపై ఎగిరేది కాంగ్రెస్ జెండా
ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి మున్సిపాలిటీపై ఎగిరేది కాంగ్రెస్ జెండాయేనని ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు అన్నారు. ఎల్లారెడ్డి మున్సిపాలిటి పరిధిలోని పలు వార్డులలో శనివారం ఆయన పార్టీ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎల్లారెడ్డి మున్సిపాలిటిలో రెండేళ్లలో ఎంతో అభివృద్ధి చేశామన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం అర్ధంతరంగా నిలిపివేసిన పనులను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు తీసుకువచ్చి వాటిని పూర్తి చేస్తోందన్నారు. కౌన్సిలర్ అభ్యర్థులు పద్మ శ్రీకాంత్, తిరుపతి న్నారు.
గడపగడపకు సంక్షేమ ఫలాలు అందించాం
నిజాంసాగర్(జుక్కల్): రాష్ట్రంలో ప్రతీ గడపగడపకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి దక్కిందని ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతా రావు అన్నారు. బిచ్కుంద మున్సిపాలిటీలో శనివారం ఎన్నికల ప్రచార సభలో వారు మాట్లాడారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, హస్తం గుర్తుకు ఓటు వేయాలని కోరారు. మెదక్ పార్లమెంట్ ఎన్నికల ఇన్‌చార్జీ నీలం మధు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ కాంగ్రెస్ నాయకులు సాయిపటేల్, విఠల్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
ఎల్లారెడ్డిపై ఎగిరేది కాంగ్రెస్ జెండా


