సంక్షిప్తం..
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెరగాలి
మద్నూర్(జుక్కల్): ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలని మండల ప్రత్యేక అధికారి రామ్మోహన్ సూచించారు. మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను మంగళవారం ఆయన పరిశీలించారు. అనంతరం శేఖాపూర్‌లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ముగ్గు పోసి పనులు ప్రారంభించారు. అనంతరం గ్రామ శివారులోని నర్సరీని పరిశీలించారు. ఆయనతో పాటు ఎంపీడీవో రాణి, మద్నూర్ పంచాయతీ కార్యదర్శి సందీప్ ఉన్నారు.
కూలీలు సమయ పాలన పాటించాలి
మాచారెడ్డి: ఉపాధి హామీ కూలీలు సమయ పాలన పాటించాలని ఫరీదుపేట గ్రామ సర్పంచ్ నరసింహారెడ్డి సూచించారు. మంగళవారం ఆయన ఉపాధిహామీ పనులను ప్రారంభించారు. కూలీలు కొలతల ప్రకారం పనులు చేస్తూ ఉపాధి పొందాలని సూచించారు. ఉప సర్పంచ్ బాలాగౌడ్, వార్డు సభ్యులు జనపాల శ్రీకాంత్, పంచాయతీ కార్యదర్శి లావణ్య, కారోబార్ రవీందర్, ఫీల్డ్ అసిస్టెంట్ భూమేష్ ఉన్నారు.
మోతెలో ఉపాధి పనులు ప్రారంభం
లింగంపేట(ఎల్లారెడ్డి): మోతె గ్రామంలో మంగళవారం ఉపాధి హామీ పనులు ప్రారంభించినట్లు సర్పంచ్ సుజాతాబాయి తెలిపారు. గ్రామంలోని కూలీలకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి పనులు చేపట్టినట్లు ఆమె పేర్కొన్నారు. క్షేత్రసహాయకుడు సరిచంద్, కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.
ఎర్రాపహాడ్ పీహెచ్‌సీలో
ఆరోగ్య మహిళ కార్యక్రమం
తాడ్వాయి(ఎల్లారెడ్డి): ఎర్రాపహాడ్ పీహెచ్‌సీలో మంగళవారం ఆర్యోగ్య మహిళా కార్యక్రమం నిర్వహించారు. ప్రత్యేకంగా వైద్య శిబిరం నిర్వహించి పరీక్షలు చేశారు. ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఽవైద్యాధికారి కాశిం, హోమియోపతి డాక్టర్ విజయలక్ష్మి, హెచ్‌ఈవో నారాయణ, సూపర్‌వైజర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
దివ్యాంగులకు ఫిజియోథెరపి
భిక్కనూరు: మండల కేంద్రంలోని భవిత కేంద్రంలో మంగళవారం ఏడుగురు విద్యార్థులకు ఫిజియోథెరపీ చికిత్సలు నిర్వహించారు. ఫిజియోథెరపీతో మానసిక ఉపశమనం కలుగుతుందని ఫిజియోథెరపిస్ట్ నవీన్ సాయి పేర్కొన్నారు. మండల విద్యాధికారి రాజగంగారెడ్డి, హెచ్‌ఎం శ్రీమతి, స్పెషల్ ఎడ్యుకేటర్స్ స్వప్న, ఐఆర్పీ మహేందర్, తదితరులు పాల్గొన్నారు.
సీఎంఆర్‌ఎఫ్ చెక్కులతో ఆర్థిక భరోసా
పెద్దకొడప్‌గల్(జుక్కల్):సీఎంఆర్‌ఎఫ్ చెక్కులతో పే దకుటుంబాలకు ఆర్థిక భరోసా వస్తోందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం బేగంపూర్ గ్రామానికి చెందిన సాయిగొండకు, పెద్దకొడప్‌గల్ గ్రామానికి చెందిన సేరేష్ కుమార్‌కు చెక్కులను మండల కేంద్రంలో పంపిణీ చేశారు. ఉప సర్పంచ్ నాగరాజ్, నాయకులు పండరి, మోహన్ తదితరులు పాల్గొన్నారు.
గర్భిణులు పౌష్టికాహారం తీసుకోవాలి
భిక్కనూరు: గర్భిణులు పౌష్టికాహారం తీసుకోవా లని మండల పీహెచ్‌సీ వైద్యాధికారి దివ్య సూచించారు. మంగళవారం ప్రభుత్వ ఆస్పత్రిలో అమ్మఒడి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణులకు పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ల్యాబ్ టెక్నిషియన్ వనశ్రీ, సిబ్బంది పూజ, హేమలత, యశోద తదితరులు పాల్గొన్నారు.
నాణ్యమైన విద్య అందించాలి
పెద్దకొడప్‌గల్(జుక్కల్): విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని ఎంఈవో ప్రవీణ్ కుమార్ ఉపాధ్యాయులకు సూచించారు. మంగళవారం ఆయన మండలంలోని అంజని, శివాపూర్, తలాబ్ తండా పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల రికార్డులను పరిశీలించారు. ఉపాధ్యాయులు జగదీష్ తదితరులు పాల్గొన్నారు.
సంక్షిప్తం..
సంక్షిప్తం..
సంక్షిప్తం..
సంక్షిప్తం..
సంక్షిప్తం..


