అయ్యప్ప ఆలయానికి విరాళం | - | Sakshi
Sakshi News home page

అయ్యప్ప ఆలయానికి విరాళం

Feb 11 2026 7:46 AM | Updated on Feb 11 2026 7:46 AM

అయ్యప

అయ్యప్ప ఆలయానికి విరాళం

అయ్యప్ప ఆలయానికి విరాళం వృద్ధుల సంక్షేమానికి కృషి మొక్కలు నాటి సంరక్షించాలి

లింగంపేట(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలోని ఉత్తర శబరి అయ్యప్ప ఆలయానికి స్థానిక నాయకులు వంజరి ఎల్లమయ్య రూ.2.11 లక్షల విరాళం అందజేశారు. మంగళవారం ఆలయం ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన విరాళం ప్రకటించి ఆలయ ధర్మకర్త రవీందర్‌గౌడ్‌కు అందజేశారు. ఆలయ కమిటీ సభ్యులు చంద్రమౌళి, శ్రీకాంత్‌, రాజిరెడ్డి, అరుణ్‌, గౌతమ్‌, వినోద్‌, సందీప్‌, సేవ్యానాయక్‌, రాజు పాల్గొన్నారు.

భిక్కనూరు: వృద్ధుల సంక్షేమం, వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని రెడ్డి వృద్ధుల సంఘం అధ్యక్షుడు ఏనుగు రాంరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం లక్ష్మీదేవునిపల్లిలో వృద్ధుల సంఘం సమావేశం నిర్వహించారు. అనంతరం వృద్ధులకు క్రీడాపోటీలు నిర్వహించారు. ప్రతిభ చూపిన వారికి బహుమతులు అందజేశారు. సంఘం సభ్యులు నర్సారెడ్డి, తిరుమలరెడ్డి, రాజిరెడ్డి, మురళిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

దోమకొండ: గ్రామ పంచాయితీల పరిధిలో మొక్కలను నాటి సంరక్షించాలని ఎంపీడీవో ప్రవీణ్‌ కుమార్‌ సూచించారు. మంగళవారం ముత్యంపేటలో నర్సరీని పరిశీలించి అనంతరం మొక్కలకు నీటిని పోశారు. ఆయన వెంట మండల విద్యాధికారి విజయ్‌కుమార్‌, ఎంపీవో రవికుమార్‌, గ్రామ సర్పంచ్‌ ఆశబోయిన అక్షర, కార్యదర్శి అంజయ్య, ఉపసర్పంచ్‌ మహేందర్‌గౌడ్‌, నాయకులు శ్రీనివాస్‌ తదితరులు ఉన్నారు.

హాజీపూర్‌లో..

ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి మండలంలోని హాజీపూర్‌లో నర్సరీని ఎంపీడీవో తాహేరాబేగం మంగళవారం పరిశీలించారు. నర్సరీలో మొక్కలు బాగా పెరిగేందుకు మంచి విత్తనాలు బ్యాగులలో నాటాలని అన్నారు. ప్రతి రోజు నీరు పట్టి వాటిని సంరక్షించాలని నిర్వాహకులకు సూచించారు.

అయ్యప్ప ఆలయానికి విరాళం 
1
1/2

అయ్యప్ప ఆలయానికి విరాళం

అయ్యప్ప ఆలయానికి విరాళం 
2
2/2

అయ్యప్ప ఆలయానికి విరాళం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement