అభివృద్ధి అంటే పారిపోవడమా | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధి అంటే పారిపోవడమా

Feb 7 2026 10:12 AM | Updated on Feb 7 2026 10:12 AM

అభివృద్ధి అంటే పారిపోవడమా

అభివృద్ధి అంటే పారిపోవడమా

ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ

కామారెడ్డి టౌన్‌: మున్సిపల్‌ పట్టణ సమగ్ర అభివృద్ధి కాంగ్రెస్‌ పార్టీతోనే సాధ్యమని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ అన్నారు. మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం జిల్లా కేంద్రంలో పలు వార్డుల్లో అభ్యర్థులతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. ఎన్నికల్లో గెలిచి ప్రజలకు కనపడకుండా పారిపోవడమే అభివృద్ధి అని ప్రత్యర్థి పార్టీల నాయకులు భావిస్తున్నారా అని ఆయన ప్రశ్నించారు. ఎమ్మెల్యేగా గెలిచిన ఈ రెండేళ్ల ఏళ్లలో కామారెడ్డికి చేసిన అభివృద్ధి ఏంటో చెప్పి ఓట్లు అడిగే దమ్ముందా అని నిలదీశారు. కాంగ్రెస్‌ అభ్యర్థులు గెలిచిన తర్వాత ఎవరైనా అవినీతికి పాల్పడితే వారిని ఇందిరా గాంధీ చౌరస్తాలో నిలబెట్టి పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తానని హామీ ఇచ్చారు. హస్తం గుర్తుకు ఓటు వేసి అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement