రాష్ట్ర స్థాయికి ఎంపికై న కరాటే విద్యార్థులకు సన్మానం | - | Sakshi
Sakshi News home page

రాష్ట్ర స్థాయికి ఎంపికై న కరాటే విద్యార్థులకు సన్మానం

Feb 12 2026 7:39 AM | Updated on Feb 12 2026 7:39 AM

రాష్ట

రాష్ట్ర స్థాయికి ఎంపికై న కరాటే విద్యార్థులకు సన్మానం

రాష్ట్ర స్థాయికి ఎంపికై న కరాటే విద్యార్థులకు సన్మానం 17 నుంచి పీజీ మొదటి సెమిస్టర్‌ పరీక్షలు

బీబీపేట: జనగామ నుంచి రాష్ట్ర స్థాయికి ఎంపికై న కరాటే విద్యార్థులు డాకూరి రోహిత్‌, పాత జెన్నీక, చాకలి మనోజ్‌, డాకూరి వరుణ్‌, డాకూరి భానులను బుధవారం గ్రామ సర్పంచ్‌ మట్ట శ్రీనివాస్‌, పాలకవర్గ సభ్యులు ఘనంగా సన్మానించారు. జిల్లా స్థాయిలో జరిగిన సీఎం కప్‌ పోటీలలో గ్రామం నుంచి రాష్ట్ర స్థాయికి ఎంపిక కావడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. ఉప సర్పంచ్‌ పాత స్వామి, వార్డ్‌ సభ్యులు నర్సింహాచారి. బెల్లే వంశీ, డాకూరి శ్యామల, గ్రామస్తులు పాల్గొన్నారు.

జనతా పాలసీ ఇన్సూరెన్స్‌ చెక్కు అందజేత

భిక్కనూరు: బస్వాపూర్‌ గ్రామానికి చెందిన వంక లింగం అనే రైతు ఇటీవల ప్రమాదవశాత్తు మృతి చెందగా, సింగిల్‌ విండో సొసైటీలో సభ్యత్వం ఉన్నందున జనతా పాలసీ ఇన్సూరెన్స్‌ ద్వారా మంజూరైన రూ.2 లక్షల చెక్కును మృతుడి భార్య రాజవ్వకు సొసైటీ కార్యదర్శి మహేశ్వరి బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సొసైటీలో రుణాలు తీసుకున్న వారు రెన్యువల్‌ చేసుకోవాలని, రెన్యువల్‌ చేసుకున్న వారికి వడ్డీ వాపస్‌ వస్తుందని ఆమె వివరించారు. సొసైటీ సిబ్బంది భగవంత్‌ రెడ్డి తదితరులున్నారు.

తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో పీజీ మొదటి సెమిస్టర్‌, పీజీ ఇంటిగ్రేటెడ్‌ కోర్సుల మొదటి సెమిస్టర్‌, ఐఎంబీఏ ఏడో సెమిస్టర్‌ రెగ్యులర్‌ పరీక్షలు ఈ నెల 17 నుంచి ప్రారంభమవుతాయని కంట్రోలర్‌ ప్రొఫెసర్‌ కే.సంపత్‌కుమార్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలకు తెలంగాణ యూనివర్సిటీ వెబ్‌సైట్‌ను సందర్శించాలని పేర్కొన్నారు.

సమ్మెను విజయవంతం చేయండి

నిజామాబాద్‌ రూరల్‌: దేశవ్యాప్తంగా నేడు జరుగనున్న సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని తెలంగాణ ఆల్‌ పెన్షనర్స్‌–రిటైర్డ్‌ పర్సన్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర నాయకులు రామ్మోహన్‌రావు అన్నారు. నాందేవ్‌వాడలోని పెన్షనర్స్‌ భవనంలో బుధవారం వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పెన్షనర్లు ఎదుర్కొంటున్న పలు సమస్యలను కేంద్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఈమేరకు రిటైర్డ్‌ ఉద్యోగులందరూ పాత కలెక్టర్‌ కార్యాలయం వద్ద ధర్నా చౌక్‌లో నేడు ఉదయం 10 గంటలకు హాజరుకావాలని కోరారు. జిల్లా ప్రతినిధులు శిర్ప హనుమాండ్లు, ఈవీఎల్‌ నారాయణ, రాధా కిషన్‌, సాంబశివరావు, ప్రసాద్‌రావు పాల్గొన్నారు.

రాష్ట్ర స్థాయికి ఎంపికై న  కరాటే విద్యార్థులకు సన్మానం 1
1/2

రాష్ట్ర స్థాయికి ఎంపికై న కరాటే విద్యార్థులకు సన్మానం

రాష్ట్ర స్థాయికి ఎంపికై న  కరాటే విద్యార్థులకు సన్మానం 2
2/2

రాష్ట్ర స్థాయికి ఎంపికై న కరాటే విద్యార్థులకు సన్మానం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement