కొనసాగుతున్న నిజాంసాగర్ నీటి విడుదల
నిజాంసాగర్(జుక్కల్): నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువకు నీటి విడుదల కొనసాగుతోంది. ఆయకట్టు కింద సాగవుతున్న పంటల కోసం ప్రధాన కాలువకు నీరు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువకు 1,800 క్యూసెక్కుల చొప్పున నీరు విడుదలవుతోంది. నీటిని సద్వినియోగం చేసుకోవాలని నీటిపారుదలశాఖ అధికారులు కోరారు.
● 49 వార్డుల్లో 30 మంది
మొదటిసారి ఎన్నిక
కామారెడ్డి టౌన్: కామారెడ్డి మున్సిపాలిటీ ఈసారి సరికొత్త శోభను సంతరించుకోనుంది. మార్పును కోరుకున్న ఓటర్లు.. కొత్తవారికి అవకాశం ఇచ్చారు. దీంతో ఈసారి ఏకంగా 30 మంది మొదటిసారి కౌన్సిల్‌లో అడుగుపెట్టబోతున్నారు. వీరి కుటుంబ సభ్యులెవరికీ గతంలో కౌన్సిలర్లుగా పనిచేసిన అనుభవం లేకపోవడం గమనార్హం. కామారెడ్డి బల్దియాలో 49 వార్డులున్నాయి. ఇటీవల నిర్వహించిన ఎన్నికలలో 30 మంది కొత్తవారు కౌన్సిలర్లుగా ఎన్నికయ్యారు. ఇందులో బీజేపీ నుంచి 12 మంది, కాంగ్రెస్ నుంచి 11 మంది, బీఆర్‌ఎస్ నుంచి ఐదుగురు, ఇద్దరు స్వతంత్రులు ఉన్నారు.
కాంగ్రెస్ నుంచి..
ధరావత్ మోతీలాల్ (2వ వార్డు), షేక్ జావీద్ (4), నిట్టు గంగాధర్ (6), లలిత కొత్తపల్లి (13), హర్షిత (14), కల్లెం సావిత్రి (20), ఆఫ్రీన్ సుల్తానా (22), సుల్తానా బేగం (23), అబ్దుల్ వాజిద్ (24), ఫాతిమ (30), గ్యార అఖిల (32).
బీజేపీ నుంచి..
ఏనుగు శ్రీధర్‌రెడ్డి (8వ వార్డు), బండారి నరేందర్‌రెడ్డి (9), కాసర్ల మాధవి (10), యాడారం ప్రియాంక (16), భానుప్రకాష్ (19), దాకి అరవింద్ రాజ్ (25), గంట మధు (26), కుంట లక్ష్మారెడ్డి (33), వినోద (35), కై ర రాహుల్ (36), వంశీకృష్ణ (43), ప్రీతి ఘోరావత్ (44).
బీఆర్‌ఎస్ నుంచి..
ఫరీన్ ఖాతూన్ (7వ వార్డు), లోలం శ్రీనివాస్ (17), గోపు బాలమణి (27), మామిండ్ల లక్ష్మణ్ (28), అజీజ్ హుస్సేన్ (31).
స్వతంత్రులు : షేక్ బబ్లూ (3వ వార్డు), ఇప్ప ఉమారాణి (38వ వార్డు).
ప్రశాంతంగా ఎన్‌సీసీ ‘సీ’ సర్టిఫికెట్ పరీక్ష
ఖలీల్‌వాడి: నిజామాబాద్ జిల్లాలోని 12వ తెలంగాణ బెటాలియన్ ఎన్‌సీసీ పరిధిలో ఆదివారం ఎన్‌సీసీ ‘సీ’ సర్టిఫికెట్ పరీక్షను నగరంలోని గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో ఆదివారం నిర్వహించారు. 247 మంది క్యాడెట్స్ పరీక్షకు హాజరయ్యారు. నిజామాబాద్ గ్రూప్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ రాజేశ్ కపూర్ మాట్లాడుతూ ఎన్‌సీసీ ‘సీ’ సర్టిఫికెట్ సాధించిన క్యాడెట్లకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్ వర్తిస్తుందన్నారు. బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగడానికి, వ్యక్తిత్వ నిర్మాణానికి ఎన్‌సీసీ దోహదపడుతుందన్నారు.


