కామారెడ్డి టౌన్ : కామారెడ్డి బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని శుక్రవారం ఎన్నుకున్నట్లు ఎన్నికల అధికారి అమృతరావు వైద్య తెలిపారు. అధ్యక్షుడిగా బత్తుల నారాయణ, ప్రధాన కార్యదర్శిగా బండారి సురేందర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడిగా ఎం.రాజు, సంయుక్త కార్యదర్శిగా భార్గవ్ చంద్ర భూపాల్, కోశాధికారిగా పి.విఠల్ రావు, లైబ్రరీ సెక్రెటరీగా ఆర్.దేవేందర్ గౌడ్, క్రీడల కార్యదర్శిగా పి.యాదగిరి, కార్యవర్గ సభ్యులుగా కె.గంగరాజు, ఎం.సంజిత్ గౌడ్, షేక్ ఇర్ఫాన్ హుస్సేన్ ఎన్నికయ్యారన్నారు. నూతన కార్యవర్గం 2027 ఏప్రిల్ వరకు పదవిలో కొనసాగుతుందని తెలిపారు. నూతన కార్యవర్గ సభ్యులను న్యాయవాదులు అభినందించారు.
కామారెడ్డి క్రైం: కలెక్టరేట్‌లో శుక్రవారం దొడ్డి కొమరయ్య జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. దొడ్డి కొమరయ్య చిత్రపటానికి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుమోహన్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దొడ్డి కొమరయ్య పోరాటాన్ని వివరించారు. కార్యక్రమంలో సహాయ బీసీ అభివృద్ధి అధికారి చక్రధర్, బహుజన సంఘాల నాయకులు కొత్తపల్లి మల్లయ్య, శివరాములు, గణేష్ నాయక్, విఠల్, నాగరాజు, కుర్మ సంఘం నాయకులు భూమయ్య, సంజీవ్, స్వామి, అశ్వక్, నరేష్, స్వప్న, సునీత, పవన్, అధికారులు పాల్గొన్నారు.
కామారెడ్డి టౌన్: కామారెడ్డి పట్టణాన్ని రోజూ పరిశుభ్రం చేస్తున్నామని మున్సిపల్ ఇన్‌చార్జి కమిషనర్ ఎస్‌ఎన్ గిరి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం ‘సాక్షి’లో ప్రచురితమైన ‘చెత్త నిర్వహణ’ కథనంపై ఉన్నతాధి కారులు స్పందించి, బల్దియా అధికారులపై ఆ గ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీంతో ము న్సిపల్ ఇన్‌చార్జి కమిషనర్ స్పందించారు. హ నుమాన్ జయంతిని పురస్కరించుకుని పారిశు ధ్య కార్మికులందరూ ప్రధాన రహదారుల శు భ్రతపై దృష్టి సారించారని, అందుకే వార్డుల్లో చెత్త సేకరణలో కొంత జాప్యం జరిగిందని అ ధికారులు వివరణ ఇచ్చారు. అయితే ఇంటింటా చెత్త సేకరించే ఆటోలు మరమ్మతులకు గు రై షెడ్‌లకే పరిమితం కావడంపై అధికారులు స్పందించకపోవడం గమనార్హం. రిపేర్‌లో ఉ న్న ఆటోలు, వాహనాల మెయింటెనెన్స్‌పై అ ధికారులు స్పందించకపోవడం గమనార్హం. పట్టణంలో దాదాపు 10కి పైగా ఆటోలు మరమ్మతులు లేక మూలన పడ్డాయి. ప్రస్తుతం మూడు, నాలుగు వార్డులకు కలిపి ఒక ఆటో ను వినియోగిస్తున్నారు. తమ వార్డులకు వా రం రోజులుగా చెత్త సేకరణ వాహనాలు రావ డం లేదని పలువురు కౌన్సిలర్లే ఆరోపిస్తుండ డం పరిస్థితికి అద్దం పడుతోంది. వాహనాలకు మరమ్మతులు చేయించి, చెత్త సేకరణను వేగవంతం చేయాలని ప్రజలు కోరుతున్నారు.
జీజీహెచ్‌లో అగ్ని ప్రమాదం
సుభాష్‌నగర్ : నిజామాబాద్‌లోని జీజీహెచ్ లో శుక్రవారం స్వల్ప అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆస్పత్రిలోని ఓ గదిలో చెత్తా చెదారం పేరుకుపోయింది. ఎవరో సిగరెట్ తాగి అక్కడే పారేయడంతో ప్లాస్టిక్ వ్యర్థాలకు నిప్పంటుకొని పొగలు కమ్ముకున్నాయి. గమనించిన ఆస్పత్రి సిబ్బంది అగ్ని మాపక కేంద్రానికి ఫోన్ చేయడంతో హుటాహుటిన రెండు ఫైరింజన్లు అక్కడికి చేరుకొని మంటలను ఆర్పేశాయి.


