‘పుష్కర ఘాట్‌ ఏర్పాటుకు కృషి’ | - | Sakshi
Sakshi News home page

‘పుష్కర ఘాట్‌ ఏర్పాటుకు కృషి’

Apr 4 2026 8:01 AM | Updated on Apr 4 2026 8:01 AM

నవీపేట: యంచ శివారులోని గోదావరి నది ఒడ్డున పుష్కర ఘాట్‌ ఏర్పాటుకు కృషి చేస్తానని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి పేర్కొన్నారు. నిర్మల్‌ జిల్లా బాసరలో పలు అభివృద్ధి పనుల ప్రారంభో త్సవాలకు సీఎం రేవంత్‌రెడ్డి వస్తున్న నేపథ్యంలో ఏర్పాట్లను సమీక్షించేందుకు శుక్రవారం అక్కడికి వెళ్లారు. పుష్కర ఘాట్‌ ఏర్పాటు చేయాలని ఇటీవల యంచ గ్రామస్తులు ఆయనను కలవడంతో మార్గమధ్యలో యంచ తీరాన్ని పరిశీలించారు. యంచ తీరం పుష్కర ఘాట్‌ ఏర్పాటుకు అనుకూలంగా ఉందని ఆయన పేర్కొన్నారు. కలెక్టర్‌తో మాట్లాడి పుష్కర ఘాట్‌ ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. ఆయన వెంట ఉర్దూ అకాడమీ చైర్మన్‌ తా హెర్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అంతిరెడ్డి రా జిరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు నగేశ్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్‌గౌడ్‌, ఎంపీపీ రాజేందర్‌గౌడ్‌, పార్టీ మండల నాయకులు సింధె ధర్మాజీ తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement