అంబేడ్కర్‌ జయంతిన మెగా రక్తదాన శిబిరం | - | Sakshi
Sakshi News home page

అంబేడ్కర్‌ జయంతిన మెగా రక్తదాన శిబిరం

Apr 4 2026 8:01 AM | Updated on Apr 4 2026 8:01 AM

కామారెడ్డి టౌన్‌ : అంబేడ్కర్‌ జయంతిని పురస్కరించుకుని ఈనెల 14న రక్తదాన శిబిరాన్ని నిర్వహించనున్నట్లు ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొంగల వెంకటి తెలిపారు. శుక్రవారం కామారెడ్డిలో విలేకరులతో మాట్లాడారు. జిల్లా కేంద్రంలోని కర్షక్‌ బీఈడ్‌ కళాశాలలో కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్‌ వైశ్య ఫెడరేషన్‌ల సహకారంతో ఈ శిబిరం నిర్వహిస్తున్నామన్నారు. తలసేమియాతో బాధపడుతున్న చిన్నారులను ఆదుకోవడమే లక్ష్యంగా నిర్వహించే రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలని కోరారు. రక్తదానం చేసే మొదటి 200 మందికి ఉచితంగా హెల్మెట్లు అందజేస్తామన్నారు. కార్యక్రమంలో వైశ్య ఇంటర్నేషనల్‌ ఫెడరేషన్‌ సేవాదళ్‌ రాష్ట్ర చైర్మన్‌ బాలు, ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్‌ నాయక్‌, ప్రధాన కార్యదర్శి సంగయ్య, కోశాధికారి శ్రీనివాస్‌, ప్రతినిధులు రాజయ్య, వంశి, రాజన్న తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement