డ్రైవర్ ఉన్నా.. బస్సు లేదు!
నస్రుల్లాబాద్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఆటోల్లో నుంచి దిగుతున్న విద్యార్థినులు
నస్రుల్లాబాద్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఆటోల్లో చేరుకున్న వీరంతా బీఎస్సీ నర్సింగ్‌కళాశాల విద్యార్థినులు. సుమారు 200 మంది వరకు ప్రతి రోజూ ఒక్కొక్కరు రూ.50 ఖర్చు పెట్టుకుని ప్రతిరోజూ మండల కేంద్రానికి వచ్చి ప్రజల ఆరోగ్య వివరాలు సేకరిస్తున్నారు. కళాశాలకు బస్సు లేకపోవడంతో వీరిపై ఆర్థికభారం పడుతోంది. ప్రాక్టికల్స్ కోసం గ్రామాలకు వెళ్లాల్సి ఉన్నా నర్సింగ్ విద్యార్థినులకు రవాణా సౌకర్యం లేదు. దుర్కిలోని కళాశాల నుంచి బాన్సువాడ ఏరియా ఆస్పత్రి, నిజామాబాద్ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి విద్యార్థినులు నిత్యం తమ సొంత ఖర్చుతో వెళ్తున్నారు. నర్సింగ్ కళాశాలలో డ్రైవర్, క్లీనర్ పోస్టులు భర్తీ అయినా బస్సు లేకపోవడంతో వారిని కార్యాలయ పనులకు వినియోగించుకుంటున్నారు.
– నస్రుల్లాబాద్


