పోస్టల్‌ బ్యాలెట్‌ సెంటర్‌ తనిఖీ | - | Sakshi
Sakshi News home page

పోస్టల్‌ బ్యాలెట్‌ సెంటర్‌ తనిఖీ

Feb 8 2026 4:02 AM | Updated on Feb 8 2026 4:02 AM

పోస్ట

పోస్టల్‌ బ్యాలెట్‌ సెంటర్‌ తనిఖీ

పోస్టల్‌ బ్యాలెట్‌ సెంటర్‌ తనిఖీ వాహనాల తనిఖీ బాన్సువాడను ఆదర్శంగా తీర్చిదిద్దా ఎలక్ట్రానిక్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌పై అవగాహన

ఎల్లారెడ్డిరూరల్‌: ఎల్లారెడ్డి మున్సిపల్‌ కేంద్రంలో ఏర్పాటు చేసిన పోస్టల్‌ బ్యాలెట్‌ సెంటర్‌ను శనివారం ఆర్డీవో పార్థసింహారెడ్డి పరిశీలించారు. పోస్టల్‌ బ్యాలెట్లు ఎన్ని వచ్చినాయో సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌ వేసే వారు ఆదివారం సాయంత్రం 5 గంటలలోగా వినియోగించుకోవాలని అన్నా రు. ఎన్నికల సిబ్బంది తదితరులున్నారు.

ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి పెద్ద చెరువు కట్టపై ఏర్పాటు చేసిన చెక్‌ పోస్ట్‌ వద్ద వాహనాలను ఎఫ్‌ఎస్‌టీ టీం అధికారులు తనిఖీ చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. వాహనదారులు 50 వేలకు మించి నగదును వెంట తీసుకెళ్లరాదని అన్నారు. అంతకు మించి నగదు ఉంటే దానికి సంబంధించిన పత్రాలు చూపాల్సి ఉంటుందన్నారు.

తాడ్వాయి మండలంలో..

తాడ్వాయి(ఎల్లారెడ్డి): మండలంలోని కామారెడ్డి–ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై పోలీసులు శనివారం వాహనాలను తనిఖీ చేశారు. రోడ్డు భద్రత నిబంధనలు పాటించని వారికి జరిమానా విధించారు. అలాగే పెండింగ్‌లో చలాన్‌లను చెల్లించేలా చర్యలు తీసుకున్నారు. ఎస్‌ఐ నరేష్‌, పోలీసు సిబ్బంది, హోంగార్డులు పాల్గొన్నారు.

బాన్సువాడ: బాన్సువాడ మున్సిపాలిటీని అదర్శవంతంగా తీర్చిదిద్దానని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని గాంధీచౌక్‌లో శనివారం ఆయన, ఆగ్రో ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ కాసుల బాల్‌రాజ్‌తో కలిసి ప్రజలతో మాట్లాడారు. ఇళ్లు లేని పేదలందరికీ డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు ఇచ్చామని, ఇంకా ఎవరైన పేదలుంటే వారికి ఇందిరమ్మ ఇళ్లను మంజురు చేస్తామని అన్నారు. గాంధీ చౌక్‌ వద్ద హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు చేస్తానన్నారు. బాన్సువాడ పట్టణంలో రూ.650 కోట్లతో అభివృద్ధి చేశామన్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి నార్ల వసంత, నాయకులు వాహాబ్‌, నందకిషోర్‌, నార్ల రవీందర్‌, నాగులగామ వెంకన్న, ఖమురు, గోపాల్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

బాన్సువాడ రూరల్‌: మండలంలోని శ్రీరాం నారాయణ ఖేడియా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం ఎలక్ట్రానిక్‌ వేస్ట్‌ మేనేజ్మెంట్‌ అనే అంశంపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్బంగా ప్రిన్సిపాల్‌ గంగాధర్‌ మాట్లాడుతూ.. నేటి సాంకేతిక ప్రపంచంలో ఎలక్ట్రానిక్‌ పరికరాల వినియోగం రోజురోజుకు పెరిగిపోతుందన్నారు. ఈనేపథ్యంలో ఎలక్ట్రానిక్‌ వేస్ట్‌ మేనేజ్మెంట్‌ గురించి సుపరిచితం అవ్వాల్సిన అవసరం ఉందన్నారు. టాస్క్‌ మేనేజర్‌ రఘుతేజ, ట్రైనర్‌ హనుమంతు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.

పోస్టల్‌ బ్యాలెట్‌ సెంటర్‌ తనిఖీ 
1
1/2

పోస్టల్‌ బ్యాలెట్‌ సెంటర్‌ తనిఖీ

పోస్టల్‌ బ్యాలెట్‌ సెంటర్‌ తనిఖీ 
2
2/2

పోస్టల్‌ బ్యాలెట్‌ సెంటర్‌ తనిఖీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement