పోచారం ప్రాజెక్టునుంచి రెండోవిడత నీటివిడుదల
నాగిరెడ్డిపేట : పోచారం ప్రాజెక్టు నుంచి శనివారం రెండోవిడత నీటి విడుదల చేపట్టా రు. ఆయకట్టు పరిధిలోని బీ జోన్‌లో యా సంగి పంటల సాగు నిమిత్తం ప్రాజెక్టు నుంచి 200 క్యూసెక్కుల నీటిని ప్రధాన కాలువలోకి విడుదల చేస్తున్నారు. షెడ్యూల్ ప్రకా రం 15 రోజులపాటు నీటిని విడుదల చేయ నున్నట్లు ఇరిగేషన్ వర్క్‌ఇన్‌స్పెక్టర్ యాదగి రి తెలిపారు. తర్వాత 10 రోజులపాటు నీటివిడుదల నిలిపివేస్తామని పేర్కొన్నారు.
రేపటి నుంచి సీఎం కప్
జిల్లా స్థాయి క్రీడాపోటీలు
కామారెడ్డి అర్బన్ : సీఎం కప్ జిల్లా స్థాయి క్రీడాపోటీలను ఈనెల 9 నుంచి 14 వరకు నిర్వహించనున్నట్టు జిల్లా యువజన, క్రీడల అధికారి రంగా వెంకటేశ్వరగౌడ్ ఒక ప్రకటన లో తెలిపారు. అథ్లెటిక్స్‌తో పాటు ఖోఖో, వా లీబాల్, యోగా, ఫుట్‌బాల్ అంశాల్లో పోటీ లుంటాయని పేర్కొన్నారు. ఆయా పోటీల ను జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడి యం, లయోల హైస్కూల్, భవానీరోడ్డులో ని ఖేలో ఇండియా బ్యాడ్మింటన్ సెంటర్, కా మారెడ్డి కలెక్టరేట్ సమీపంలోని జిల్లా యో గాభవన్, రామారెడ్డి మండలం ఉప్పల్‌వా యి రెసిడెన్షియల్ స్కూల్, రామారెడ్డి జిల్లా పరిషత్ హైస్కూల్ మైదానం, భిక్కనూరు జి ల్లాపరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, మందాపూర్ జిల్లా పరిషత్ హైస్కూల్, దోమకొండ గడీకోటలలో నిర్వహించనున్నామన్నారు.
నేటి నుంచి ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ సేవలు
కామారెడ్డి క్రైం: జిల్లా రైతుల కోసం ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ సేవలు ఆదివారం నుంచి అందుబాటులోకి రానున్నాయని జిల్లా వ్యవసాయ అధికారి మోహన్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రైతులు ఈ యాప్‌ను ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుని, ఆధార్, మొబైల్ నంబర్, జిల్లా, మండలం, పంట సాగు విస్తీర్ణం వివరాలతో రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. అనంతరం సమీప డీలర్ వద్ద ఎరువుల లభ్యతను పరిశీలించి యూరియాను బుక్ చేసుకోవాలని తెలిపారు. బుకింగ్ చేసుకున్న 24 గంటల్లోగా ఎరువులను కొనుగోలు చేయాల్సి ఉంటుందని, లేదంటే బుకింగ్ రద్దవుతుందని పేర్కొన్నారు. పట్టాదారులతో పాటు కౌలుదారులు సైతం ఈ యాప్‌ను ఉపయోగించవచ్చని తెలిపారు. ఏవైనా సమస్యలు ఎదురైతే వ్యవసాయ అధికారులను సంప్రదించాలని సూచించారు.
‘ప్రజావాణి కొనసాగుతుంది’
కామారెడ్డి క్రైం : మున్సిపల్ ఎన్నికలు జరు గుతున్నా కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం జరి గే ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ సోమవారం కూడా కొనసాగిస్తామని అదనపు కలెక్టర్ విక్ట ర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అధికారులు మున్సిపల్ ఎన్నికల విధుల్లో నిమగ్నమై ఉన్నప్పటికీ ప్రజావాణి కార్యక్రమం కొనసాగుతుందని పేర్కొన్నారు. ప్రజలు తమ ఫిర్యాదులను కలెక్టరేట్‌లోని 25వ నంబర్ రూంలో అందించాలని అదనపు కలెక్టర్ సూచించారు.
‘రైతు ఉత్పత్తిదారుల సంస్థలో సభ్యులుగా చేరాలి’
కామారెడ్డి అర్బన్: రైతులు రూ. 2 వేలు వాటాగా చెల్లించి రైతు ఉత్పత్తిదారుల సంస్థలు(ఎఫ్‌పీవో) ఏర్పాటు చేసుకుని బహుళ ఆర్థిక ప్రయోజనాలు పొందాలని జిల్లా సహకార అధికారి రామ్మోహన్ సూచించారు. కామారెడ్డి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో శనివారం చిన్నమల్లారెడ్డి రైతు వేదికలో ఎఫ్‌పీవోల ఏర్పాటు, పనితీరుపై అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సులో రామ్మోహన్ మాట్లాడుతూ ఎఫ్‌పీవో సభ్యత్వం తీసుకునే ప్రతి రైతుకు కేంద్ర ప్రభుత్వం తనవాటాగా రూ.2 వేలు చెల్లిస్తుందన్నారు. ఎఫ్‌పీవోల ద్వారా రైతులకు విత్తనాలు, ఎరువులు, పంట ప్రాసెసింగ్, మార్కెటింగ్, పరికరాలు, గిట్టుబాటు ధర, బ్రాడింగ్ కల్పిస్తారని వివరించారు. కార్యక్రమంలో మానిటరింగ్ అధికారి షేక్‌చాంద్, పీఏసీఎస్ కార్యదర్శి సతీష్, చిన్నమల్లారెడ్డి ఉపసర్పంచ్ స్వప్న, సొసైటీ సిబ్బంది, ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.
పోచారం ప్రాజెక్టునుంచి రెండోవిడత నీటివిడుదల


