కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పండి
కామారెడ్డి క్రైం: హామీల అమలులో విఫలమైన కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా శనివారం పట్టణంలోని డ్రైవర్స్ కాలనీ, ఒకటవ వార్డు పరిధిలోని ఇల్చిపూర్, అడ్లూర్, రెండవ వార్డు పరిధిలోని రామేశ్వర్‌పల్లి గ్రామాల్లో పార్టీ అభ్యర్థి తరఫున ఆయన ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి బీఆర్‌ఎస్ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్ధించారు. కాంగ్రెస్‌పార్టీ కల్యాణలక్ష్మి, రైతుబంధు తదితర పథకాలతోపాటు హామీలు ఇచ్చి చేస్తున్న మోసాలపై ప్రజలకు బాకీ కార్డులు పంచుతూ వివరించారు. కామారెడ్డి బల్దియాపై గులాబీ జెండా ఎగురవేయాలని కోరారు. అలాగే బీఆర్‌ఎస్ మున్సిపల్ ఎన్నికల ఇన్‌చార్జి వీజీ గౌడ్ పట్టణంలోని 38వ వార్డు పరిధిలో ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించి ఓట్లు అభ్యర్ధించారు.


