స్వీయ చరిత్ర రాసుకున్న స్వామి! | - | Sakshi
Sakshi News home page

స్వీయ చరిత్ర రాసుకున్న స్వామి!

Feb 9 2026 7:28 AM | Updated on Feb 9 2026 7:28 AM

స్వీయ

స్వీయ చరిత్ర రాసుకున్న స్వామి!

నాలుగు దశాబ్దాల తన ప్రస్తానానికి

అక్షరరూపం

ఆయన మరణించిన రోజునే వెలుగులోకి

సామాజిక మాధ్యమాల్లో వైరల్‌

సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : Ñç³ÏÐø-§ýlÅ-Ð]l$…ÌZ çÜ$©Æý‡ƒM>ÌS… ç³°-^ólíÜ G¯ŒS-Mú…-r-ÆŠ‡ÌZ ^èl°-´ùƇ$$¯]l Ð]l*ÐøÆ‡$$çÜ$t A{VýS-¯ól™èl {糿ê-MýSÆŠ‡ AÍ-Ķæ*‹Ü ç³yýlPÌŒæ-ÝëÓÑ$, AÍ-Ķæ*‹Ü ÌZMóSsìæ ^èl…§ýlÆŠ‡ ¯éË$VýS$ §ýlÔ>»êªÌS ™èl¯]l {ç³Ýë¢-¯]l…Oò³ Æ>çÜ$-MýS$¯]l² ïÜÓĶæ$ ^èlÇ{™èl Ôèæ°-ÐéÆý‡… Æ>{† ¯]l$…_ ÝëÐ]l*hMýS Ð]l*«§ýlÅÐ]l*ÌZÏ ^èlMýSPÆý‡$Ï Möyýl$-™ø…-¨.ÝëÓÑ$ D ¯ðlÌS 6¯]l VýSyìlaÆøÍ hÌêÏÌZ fÇ-W¯]l G¯ŒS-Mú…-rÆŠ‡ÌZ Ð]l$Æý‡-×ìæ…-_¯]l ÑçÙĶæ$… ™ðlÍ-íÜ…§ól. ™èl¯]l iÑ™èl ^èlÇ-{™èl¯]l$ ÑÐ]l-ÇçÜ*¢ VýS™èl…ÌZ BĶæ$¯]l Æ>íܯ]l ïÜÓĶæ$ ^èlÇ{™èl C糚yýl$ A…§ýl-DZ ^èl¨ÑÝù¢…-¨. C{Ýùh-ÐéyîlÌZ 1969 ÌZ f°-Ã…-_¯]l సస్వÝëÓÑ$ BÆø-™èlÆý‡VýS† Ð]lÆý‡MýS$ Ð]l*{™èlÐól$ ^èl¨Ñ-¯]lr$t A…§ýl$ÌZ õ³ÆöP¯é²Æý‡$. ™èl¯]l 16Ð]l Hsê 1984ÌZ çÜ…Vøh-Ðé-yìlMìS ^ðl…¨¯]l çÜ$ÌZ-^èl-¯]l™ø ÑÐé-çßæ-OÐðl$…-§ýl-°, Ð]l¬VýS$YÆý‡$ í³ÌSÏ˰ õ³ÆöP-¯é²Æý‡$. ò³§ýlª MýS*™èl$Æý‡$ Æý‡h™èl ç³#r$t-MýS-™ø¯ól ¨ÐéÅ…-VýS$Æ>Ë$ M>Ð]l-yýl…, ç³§ýlÐ]lÊyø Hsê 1999ÌZ ^èl°-´ù-Ƈ$$…§ýl° ÑÐ]l-Ç…-^éyýl$. 1995ÌZ JMýSÝëÇ ™èl¯]l FÇMìS ÐðlãÏ ™èlÍϧýl…{yýl$-ÌS¯]l$ MýSÍíÜ Ð]l*sêÏyé-¯]l-°, A§ól BQÇ ^èl*ç³# A° ÐðlÌSÏyìl…^éyýl$.

నాలుగు దశాబ్దాల నాడే విప్లవ పాఠాలు...

1986లో ఇస్రోజివ ాడి గ్రామానికి వచ్చిన విప్లవకారులతో పరిచయం ఏర్పడిందని, ఆ పరిచయంతోనే తాను రాడికల్‌ యూత్‌ లీగ్‌లో చేరి గ్రామంతోపాటు చుట్టుపక్కల గ్రామాల్లో పార్టీ కార్యకలాపాల్లో పాల్గొన్నట్టు వివరించాడు. భూస్వాముల అరాచకాలపై సంఘ సభ్యులతో కలిసి జరిపిన పోరాటాలను తెలిపాడు. ఊరును పోలీసులు చుట్టుముట్టి ప్రజల్ని తీసుకువెళ్లి చిత్రహింసలు పెట్టిన విషయంలో భూస్వాములపై ఒత్తిడి తీసుకురావడంతో ప్రజల్ని వదిలిపెట్టారని తెలిపాడు. 1991లో పూర్తిస్థాయి విప్లవకారుడిగా మారినట్టు పేర్కొన్నాడు. కామారెడ్డి లోకల్‌ ఏరియా దళంలో, తర్వాత సిర్నాపల్లి దళ కమాండర్‌గా, డివిజన్‌ కమిటీ మెంబర్‌గా, కామారెడ్డి ఏరియా కమాండర్‌గా సిరిసిల్లా ఏరియాకు ఇన్‌చార్జీగా ఉండి ఆ ప్రాంతంలో ఉద్యమాన్ని గైడ్‌ చేసినట్టు తెలిపాడు. తెలంగాణ ప్లీనంలో కొంతమంది క్యాడర్‌ను దండకారణ్యానికి పంపాలని తీసుకున్న నిర్ణయం మేరకు 2003 డిసెంబర్‌లో తాను అక్కడికి వెళ్లినట్టు వివరించారు. దక్షిణ సబ్‌ జోనల్‌ బ్యూరోలోని పశ్చిమ బస్తర్‌లో డీవీసీఎంగా, తర్వాత కంపనీ–2 కమాండర్‌గా, సచీవ్‌గానూ, దక్షిణ్‌ సబ్‌ జోనల్‌ కమాండ్‌ మెంబర్‌గా పనిచేసినట్టు అందులో వివరించారు. 2006లో దండకారణ్య కాన్ఫరెన్సులో తనను ఎస్‌జెడ్‌సీలోకి తీసుకున్నారని, ఉద్యమ అవసరాల రీత్యా 2011లో పశ్చిమ సబ్‌ జోనల్‌కు బదిలీ అయి 2020 వరకు అక్కడే సబ్‌ జోనల్‌ బ్యూరో మెంబర్‌గా, పశ్చిమ సబ్‌ జోనల్‌ కమాండర్‌ ఇన్‌ చీఫ్‌గా, కంపెనీ 10కు సచీవ్‌గా, కంపెనీ 4కు సచీవ్‌గా, ఉత్తర్‌ గడ్చిరోలి డివిజన్‌కు సబ్‌ జోనల్‌ బ్యూరో నుంచి ఇన్‌చార్జీగా పనిచేసినట్టు తెలిపాడు.

దాడులకు నాయకత్వం..

1993లో సిరా ్న పల్లిలో పోలీస్‌ అవుట్‌పోస్టుపై దా డి, 1999లో మెదక్‌ జిల్లా పాపన్నపేట పోలీస్‌ స్టేషన్‌పై దాడి, రామారెడ్డి పోలీస్‌ అవుట్‌పోస్టులపై దాడికి ప్రయత్నం చేసినట్లు వివరించాడు. కరీంనగర్‌ జిల్లా చందుర్తిలో 1998లో అంబుష్‌ వేసి ఎస్సైని, 2000 సంవత్సరంలో కోనరావుపేట మండలం ఎగ్లాస్‌పూర్‌ అంబూష్‌లో తాను పాల్గొన్నది వివరించాడు.

శత్రుదాడులకు గురైన ఘటనలు ఎన్నో...

1993లో నిజామాబాద్‌ జిల్లా పడ్కల్‌లో ఆరుగురితో కూడిన దళం ఒక ఇంట్లో ఉన్న సమాచారంతో వందలాది మంది పోలీసు బలగాలు చుట్టుముట్టిన ఘటనలో హోరాహోరీగా జరిగిన పోరాటాన్ని వివరించాడు. అందరూ చనిపోయినా తాను ఎలా తప్పించుకున్నది అందులో పేర్కొన్నాడు. 1999లో ప్రాజెక్టు రామడుగులో దాడి నుంచి తప్పించుకున్నట్టు, 1997లో నల్లవెల్లిలో యూత్‌తో మాట్లాడుతుండగా జరిగిన దాడి, 2020–21లో జగిత్యాల మండలం గజ్జెరాళ్లగుట్టపై ఉండగా గ్రేహౌండ్స్‌ బలగాలు జరిపిన దాడి, అందులో రమేశ్‌ అనే దళకమాండర్‌ చనిపోగా, మిగతా వారు తప్పించుకున్నది వివరించాడు. 1998లో సిర్నాపల్లి అడవిలో జరిగిన దాడిలో తనతోపాటు న్యాలకొండ రజిత అలియాస్‌ పద్మక్క తప్పించుకున్న తీరును తెలిపాడు.

స్వీయ చరిత్ర రాసుకున్న స్వామి! 1
1/1

స్వీయ చరిత్ర రాసుకున్న స్వామి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement