ప్రజలు స్వేచ్ఛగా ఓటేయాలి
సబ్ కలెక్టర్ కిరణ్మయి
బాన్సువాడ: ప్రజలు స్వేచ్ఛగా ఓటేయాలని సబ్ కలెక్టర్ కిరణ్మయి పిలుపునిచ్చారు. సోమవారం ఎన్నికల ప్రచారం ముగియడంతో బాన్సువాడ పట్టణంలోని 19 వార్డుల్లో పోలీసులు కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ నెల 11న మున్సిపల్ ఎన్నికలు జరుగనున్నాయని, పట్టణంలో 39 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని అన్నారు. డబ్బుకు, మద్యానికి ఓటర్లు లోను కావవద్దని, రాజ్యంగబద్దంగా ఓటేయాలని సూచించారు. డీఎస్పీ విఠల్‌రెడ్డి, సీఐలు శ్రీధర్, తిరుపయ్య, ఎస్సైలు, సిబ్బంది ఉన్నారు.
ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ కేంద్రం పరిశీలన
బాన్సువాడ:ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని సోమ వారం సబ్ కలెక్టర్ కిరణ్మయి పరిశీలించారు. ఎస్‌ఆర్‌ఎన్‌కే డిగ్రీ కళాశాలలో డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాలు,స్ట్రాంగ్ రూం, కౌంటింగ్ గదులను పరిశీలించారు.ఏయే గదుల్లో కౌంటింగ్ కోసం ఏర్పాట్లు చే యాలో సిబ్బందికి సూచించారు. ఎన్నికల విధులు కేటాయించిన సిబ్బంది సమయానికి రావాలని అ న్నారు.మున్సిపల్ కమిషనర్ శ్రీహరిరాజు ఉన్నారు.
ఎల్లారెడ్డిలో..ఆర్డీవో పార్థసింహారెడ్డి
ఎల్లారెడ్డిరూరల్:ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన మున్సిపల్ ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను ఆర్డీవో పార్థసింహారెడ్డి సోమవారం పరిశీలించారు. మంగళవారం ఎన్నికలకు సంబంధించిన సామగ్రి ని తరలించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు ఆ యన తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని అన్నారు. తహసీల్దా ర్ ప్రేమ్‌కుమార్, ఎంపీడీవో తాహేరాబేగం, మున్సిపల్ కమిషనర్ మహేశ్ కుమార్ తదితరులున్నారు.


