లైంగిక వేధింపుల నివారణ కమిటీలు ఏర్పాటు చేయాలి | - | Sakshi
Sakshi News home page

లైంగిక వేధింపుల నివారణ కమిటీలు ఏర్పాటు చేయాలి

Feb 10 2026 7:25 AM | Updated on Feb 10 2026 7:25 AM

లైంగి

లైంగిక వేధింపుల నివారణ కమిటీలు ఏర్పాటు చేయాలి

లైంగిక వేధింపుల నివారణ కమిటీలు ఏర్పాటు చేయాలి సోషల్‌ మీడియా యువతను తప్పుదోవ పట్టిస్తోంది ఫార్మా రంగంలో ఉద్యోగ అవకాశాలు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఫలితాలు విడుదల మద్యం దుకాణాల మూసివేత

కామారెడ్డి అర్బన్‌: పని చేసే ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులను అరికట్టడానికి ఆయా ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ సంస్థలు, పాఠశాలలు, వ్యాపార సంస్థలు, పరిశ్రమలు, ప్రయివేట్‌ రంగ సంస్థల్లో అంతర్గత ఫిర్యాదు కమిటీలను ఏర్పాటు చేయాలని జిల్లా సంక్షేమాధికారిణి ప్రమీల ఒక ప్రకటనలో తెలిపారు. లైంగిక వేధింపుల నిరోధక చట్టం–2013 ప్రకారం అశ్లీల వ్యాఖ్యలు, అభస్య ప్రవర్తన, శారీరక వేధింపులు నేరంగా పరిగణిస్తారని, 50 శాతం మంది మహిళలతో అంతర్గత ఫిర్యాదు కమిటీ ఏర్పాటు చేసుకుని పర్యవేక్షించాలన్నారు. అంతర్గత కమిటీలు ఏర్పాటు చేసి పూర్తి వివరాలు షీబాక్స్‌ పోర్టల్‌లో నమో దు చేయాలని ఆమె సూచించారు. వివరాలకు మహిళా హెల్ప్‌ లైన్‌ 181 లేదా పోలీసు హెల్ప్‌ లైన్‌ 100 సంప్రదించవచ్చన్నారు.

సదాశివనగర్‌(ఎల్లారెడ్డి): సోషల్‌ మీడియా యువతను తప్పుదోవ పట్టిస్తోందని ఐఎస్‌ఆర్‌డీ స్వచ్ఛంద సంస్థ కో–ఆర్డినేటర్‌ రాజేందర్‌ రావు సూచించారు. సోమవారం మండల కేంద్రంలోని వెలుగు, ప్రగతి గ్రామ సంఘాల్లో మహిళలకు మహిళా చట్టాలపై అవగాహన కల్పించారు. మాదకద్రవ్యాల వినియోగం, సామాజిక మాధ్యమాలు, సైబర్‌ నేరాలపై అవగాహన కల్పించారు. కుటుంబంలో మానసిక ప్రశాంతత కోల్పోతే కుటుంబం, పిల్లల చదువుపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. గ్రామ సంఘం అధ్యక్షులు గువ్వ భూదేవి, ఎం.లలిత, సీసీ ఆంజనేయులు, పర్యవేక్షణ సమాఖ్య ప్రతినిధి లత, తదితరులు పాల్గొన్నారు.

కామారెడ్డి అర్బన్‌: ఫార్మా రంగంలో తెలంగాణ అగ్రగామిగా ఉండి అనేక ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోందని కామారెడ్డి ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల ప్రిన్సిపల్‌ కె.విజయ్‌కుమార్‌ అన్నారు. సోమవారం కళాశాలలో కళాశాల టీఎస్‌కేసీ ఆధ్వర్యంలో జాబ్‌మేళా నిర్వహించారు. జాబ్‌మేళాలో ఏడుగురు విద్యార్థులు ఎంపిక కావడంపై ప్రిన్సిపల్‌ సంతోషం వ్యక్తం చేశారు. టీఎస్‌కేసీ సమన్వయకర్త రాజ్‌గంభీర్‌రావు, అధ్యాపకులు పాల్గొన్నారు.

బాన్సువాడ రూరల్‌: శ్రీరాం నారాయణ ఖేడి యా ప్రభుత్వ డిగ్రీకళాశాల(అటానమస్‌) మొ దటి, మూడవ సెమిస్టర్‌ పరీక్షా ఫలితాలను సో మవారం పరీక్షల నియంత్రణ అధికారి ప్రొఫె సర్‌ కే.సంపత్‌కుమార్‌తో కలిసి ప్రిన్సిపల్‌ గంగాధర్‌ విడుదల చేశారు. అటానమస్‌ హోదా లో మొదటి సెమిస్టర్‌లో 61శాతం, మూడో సెమిస్టర్‌లో 69 శాతం ఉత్తీర్ణత నమోదైందన్నా రు. యూనివర్సిటీ అదనపు కంట్రోలర్‌ శాంతాబాయి, కళాశాల పరీక్షల నియంత్రణ అధికారి మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.

ఎల్లారెడ్డిరూరల్‌: ఎల్లారెడ్డి మున్సిపల్‌ పరిధిలోని మద్యం దుకాణాలను మూసి వేయించినట్లు ఎకై ్సజ్‌ సీఐ షాకీర్‌ అహ్మద్‌ సోమవారం తెలిపారు. మున్సిపల్‌ ఎన్నికలు బుధవారం జరగనుండటంతో 48 గంటల ముందు మద్యం దుకాణాలు మూసి వేయాలన్న ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు మద్యం దుకాణాలను మూసి వేయించినట్లు తెలిపారు.

లైంగిక వేధింపుల నివారణ కమిటీలు ఏర్పాటు చేయాలి 1
1/1

లైంగిక వేధింపుల నివారణ కమిటీలు ఏర్పాటు చేయాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement