ఉచిత వైద్య శిబిరానికి అపూర్వ స్పందన
సదాశివనగర్(ఎల్లారెడ్డి): తుక్కోజీవాడిలో బుధవారం మల్లారెడ్డి నారాయణ ఆస్పత్రి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో 155 మందికి వైద్య పరీక్షలు చేశారు. అవసరమైన వారికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. సర్పంచ్ సంగారావు, వైద్యులు, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.
రత్నగిరిపల్లిలో కంటి వైద్య శిబిరం
మాచారెడ్డి: రత్నగిరిపల్లిలో రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటకు చెందిన అశ్విని ఆస్పత్రి వైద్యులు సత్యనారాయణస్వామి, అభినయ్ ఆధ్వర్యంలో బుధవారం కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. 40 మందిని పరీక్షించారు. అవసరమైన వారికి మోతి బిందు ఆపరేషన్ ఉచితంగా చేయనున్నట్లు తెలిపారు. కంటి అద్దాలను అందించారు. నేత్ర వైద్యుడు నవనీత్, సర్పంచ్ అనిత, ఆస్పత్రి సిబ్బంది మహేష్, సతీష్ పాల్గొన్నారు.
ఉచిత వైద్య శిబిరానికి అపూర్వ స్పందన


