ఉచిత ఆయుర్వేద శిబిరానికి విశేష స్పందన | - | Sakshi
Sakshi News home page

ఉచిత ఆయుర్వేద శిబిరానికి విశేష స్పందన

Feb 13 2026 3:46 AM | Updated on Feb 13 2026 3:46 AM

ఉచిత

ఉచిత ఆయుర్వేద శిబిరానికి విశేష స్పందన

మాజీ ఎమ్మెల్యేకు ఆహ్వానం బాధిత కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం ఆలయాల అభివృద్ధికి చేయూతనందించాలి

కామారెడ్డి అర్బన్‌: కామారెడ్డి సంకల్ప ఆయుర్వేద ఆస్పత్రిలో మహా శివరాత్రి సందర్భంగా గురువారం మూడు రోజుల ఉచిత ఆయుర్వేద శిబిరం ప్రారంభం కాగా విశేష స్పందన లభించిందని వైద్యుడు మృత్యుంజయ శివాచార్య తెలిపారు. కీళ్లు, వెన్ను, మెడ నొప్పులతో ఉచిత శిబిరానికి వచ్చిన వారికి రూ.2,800 విలువైన ఉచిత వైద్యాన్ని అందించారు. ఉచిత శిబిరం శుక్ర, శనివారాల్లోనూ కొనసాగుతుందని వైద్యులు పేర్కొన్నారు. శిబిరానికి వచ్చే వారు ముందుగా 99491 57912, 99854 28897 నంబర్లకు సంప్రదించి తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు.

దోమకొండ: ముత్యంపేటలో గల రేణుక ఎల్ల మ్మ తల్లి బోనాల పండుగతో పాటు కల్యాణోత్సవం పురస్కరించుకొని గురువారం మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌కు ఆహ్వాన పత్రిక అందజేసినట్లు గౌడ సంఘం ప్రతినిధులు తెలిపారు. ఈ నెల 22 నుంచి 24 వరకు కార్యక్రమాలు ఉంటాయన్నారు. సర్పంచ్‌ అరుట్ల కవి త, ఉప సర్పంచ్‌ సత్తయ్య గౌడ్‌, గౌడ సంఘం అధ్యక్షులు రంగోల్‌ మైసాగౌడ్‌, రాజాగౌడ్‌, సొసైటీ మాజీ వైస్‌ చైర్‌పర్సన్‌ శ్రీనివాస్‌ గౌడ్‌, ఎంపీటీసీ జనార్దన్‌ రెడ్డి తదితరులున్నారు.

నస్రుల్లాబాద్‌: అంకోల్‌ గ్రామానికి చెందిన సాయి మూడు రోజుల క్రితం వర్నిలో రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆయన కుటుంబానికి గ్రామ యువకులు చందాలు సేకరించారు. బాధిత కుటుంబ సభ్యులకు రూ.63,500 అందించారు.

భిక్కనూరు: దేవాలయాల అభివృద్ధికి ప్రజలందరూ చేయూతనందించాలని సిద్ధరామేశ్వరాలయం మహంత్‌ సదాశివ మహంత్‌ అన్నారు. గురువారం తిప్పాపూర్‌ సమీపంలో అటవీ ప్రాంతంలో ఉన్న కాకిగండి శివాలయంలో ఆయన మాట్లాడారు. శివరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తిప్పాపూర్‌ సర్పంచ్‌ కుంట లింగారెడ్డి, ఆలయం అభివృద్ధి కమిటీ ప్రతినిదులు తెలిపారు. సైంటిస్టు ఆకిటి రాజిరెడ్డి.. ఆలయంలో టైల్స్‌ వేసేందుకు రూ.43 వేలు విరాళంగా అందజేశాడన్నారు.

ఉచిత ఆయుర్వేద  శిబిరానికి విశేష స్పందన 1
1/3

ఉచిత ఆయుర్వేద శిబిరానికి విశేష స్పందన

ఉచిత ఆయుర్వేద  శిబిరానికి విశేష స్పందన 2
2/3

ఉచిత ఆయుర్వేద శిబిరానికి విశేష స్పందన

ఉచిత ఆయుర్వేద  శిబిరానికి విశేష స్పందన 3
3/3

ఉచిత ఆయుర్వేద శిబిరానికి విశేష స్పందన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement