క్రైం కార్నర్
● మహిళకు తీవ్ర గాయాలు
రుద్రూర్: పొతంగల్ మండల కేంద్రంలోని రైస్ మిల్లులో జరిగిన ప్రమాదంలో ఓ మహిళా కూలికి తీవ్ర గాయాలైనట్లు కోటగిరి ఎస్సై సునీల్ తెలిపారు. కోటగిరి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన రేణి మొగులమ్మ మిల్లులో కూలి పని చేస్తోంది. ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో మిల్లును ఊడుస్తుండగా ఆమె చీర యంత్రంలోని బెల్ట్‌కు చిక్కుకుంది. దీంతో ఆమె బెల్ట్‌పై పడిపోయి యంత్రంలోకి లాగబడింది. ఈ ప్రమాదంలో ఆమె రెండు కాళ్లకు, కుడి చేతికి గాయాలయ్యాయి. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


