ఎవరి ప్రయత్నాలు వారివే.. | - | Sakshi
Sakshi News home page

ఎవరి ప్రయత్నాలు వారివే..

Feb 16 2026 7:37 AM | Updated on Feb 16 2026 7:37 AM

ఎవరి ప్రయత్నాలు వారివే..

ఎవరి ప్రయత్నాలు వారివే..

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌ : మేయర్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్ల ఎన్నిక నేపథ్యంలో ఉమ్మడి జిల్లా వ్యా ప్తంగా తీవ్ర ఉత్కంఠ, ఆసక్తి నెలకొన్నాయి. సోమ వారం ఎన్నికకు ఏర్పాట్లను పూర్తి చేశారు. నిజామా బాద్‌ కార్పొరేషన్‌తోపాటు బోధన్‌, కామారెడ్డిలో హంగ్‌ నెలకొనడంతో ఎవరు మేయర్‌, చైర్‌పర్సన్లు అవుతారనే అంశం సర్వత్రా చర్చనీయాంశమైంది. బోధన్‌ విషయంలో కొంతమేర ప్రతిష్టంభన నెలకొన్నప్పటికీ ఆదివారం రాత్రికి కొలిక్కి వచ్చినట్లు తె లుస్తోంది. కాంగ్రెస్‌తో కలిసి వెళ్లేందుకు ఎంఐఎం అభ్యర్థులు వ్యతిరేకించగా, దారుస్సలాం నుంచి వ చ్చిన ఆదేశాల మేరకు అంగీకరించారు. చైర్మన్‌గా శరత్‌రెడ్డిని మొదట అంగీకరించకపోయినా.. ఎంఐఎం అధినాయకత్వం సూచనల మేరకు చివరకు అంగీకారం కుదిరినట్లు సమాచారం.

నిజామాబాద్‌ మేయర్‌ విషయంలో మాత్రం ఎనలేని ఆసక్తి నెలకొంది. కాంగ్రెస్‌కు మేయర్‌, ఎంఐఎంకు డిప్యూటీ మేయర్‌ ఇచ్చేలా అంగీకారం కుదిరింది. మేయర్‌ కోసం నలుగురు మహిళా ఆశావహుల మధ్య పోటీ నెలకొంది. ఎవరి స్థాయిలో వారు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్‌, ఎంఐఎం కలిస్తే మ్యాజిక్‌ ఫిగర్‌ వస్తున్నప్పటికీ మ్యా జిక్‌ ఫిగర్‌కు సమీపంలో ఉన్న బీజేపీ ఎలాంటి వ్యూ హం అనుసరిస్తుందన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఇక ఆర్మూర్‌, భీమ్‌గల్‌ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్‌కు పూర్తి ఆధిక్యం ఉంది. అయితే చైర్‌పర్సన్లుగా ఎవరు అవుతారనే విషయమై ఆసక్తి నెలకొంది.

ఇందూరు మేయర్‌ ఎవరో?

కొనసాగుతున్న ఉత్కంఠ

కాంగ్రెస్‌కు మేయర్‌, ఎంఐఎంకు డిప్యూటీ మేయర్‌ ఇచ్చేలా ఒప్పందం

బోధన్‌లోనూ కాంగ్రెస్‌, ఎంఐఎం

కలిసి కౌన్సిల్‌ ఏర్పాటుకు లైన్‌ క్లియర్‌

ఆర్మూర్‌, భీమ్‌గల్‌లలో అధికార పార్టీకే అన్ని పదవులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement