అన్నీ హస్తగతం!
మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్‌ల ఎన్నికకోసం సోమవారం ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. ముందుగా నూతన కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేస్తారు. అనంతరం చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ మొదలవుతుంది. సింగిల్ నామినేషన్ వస్తే ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటిస్తారు. ఒకటి కన్నా ఎక్కువ నామినేషన్లు దాఖలైతే చేతులెత్తే పద్ధతిన ఎన్నిక నిర్వహిస్తారు.
బీజేపీకి నిరాశేనా?
కామారెడ్డి బల్దియాలో 49 వార్డులుండగా.. మున్సిపల్ చైర్మన్ పీఠం కై వసం చేసుకునేందుకు 25 మంది సభ్యుల బలం అవసరం. 19 వార్డులను గెలుచుకున్న కాంగ్రెస్‌లో ముగ్గురు స్వతంత్రులు చేరడంతో వారి బలం 22కు పెరిగింది. మరో ముగ్గురు సభ్యుల బలం అవసరం కావడంతో చైర్మన్ పీఠంపై పీఠముడి ఏర్పడింది. బీజేపీకి 16 సీట్లు, బీఆర్‌ఎస్‌కు 11 సీట్లు వచ్చాయి. ఈ క్రమంలో కాంగ్రెస్, బీజేపీలు మద్దతుకోసం బీఆర్‌ఎస్‌ను సంప్రదించాయి. అయితే కాంగ్రెస్‌తో అవగాహనకే బీఆర్‌ఎస్ మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. చైర్‌పర్సన్ పదవిని కాంగ్రెస్ తీసుకుంటుండగా.. వైస్ చైర్మన్‌గా బీఆర్‌ఎస్ కౌన్సిలర్‌కు అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం. అలాగే రెండుచొప్పున కోఆప్షన్ పదవులు పంచుకోవడానికి ఆ రెండు పార్టీల మధ్య అంగీకారం కుదిరినట్టు తెలుస్తోంది. దీంతో బీజేపీకి నిరాశ ఎదురయ్యే అవకాశాలున్నాయి.
బాన్సువాడ చైర్‌పర్సన్‌గా కాసుల విజయ!
బాన్సువాడ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీకి పూర్తి ఆధిక్యత లభించింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చైర్‌పర్సన్ అభ్యర్థిగా ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాల్‌రాజ్ భార్య విజయను ఎన్నికల సమయంలోనే ప్రకటించారు. దీంతో ఆమె ఎన్నిక లాంఛనమే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వైస్ చైర్మన్ పదవిపై స్పష్టత రాలేదు. రేష్మ బేగంతో పాటు ఖాలెక్ ఈ పదవిని ఆశిస్తున్నారు.
బిచ్కుంద చైర్‌పర్సన్‌గా సీమా షెట్కార్!
కొత్తగా ఏర్పడిన బిచ్కుంద మున్సిపాలిటీ తొలి చైర్‌పర్సన్‌గా సీమా షెట్కార్ పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. వైస్ చైర్మన్ పదవి భాగ్యలక్ష్మి, గంగాధర్‌లలో ఒకరికి దక్కవచ్చంటున్నారు.
ఉమారాణి
కామారెడ్డి బల్దియా రాజకీయం రసవత్తరంగా మారింది. ఇక్కడ అధికార, ప్రధాన ప్రతిపక్షాల మధ్య అవగాహన కుదిరినట్లు తెలుస్తోంది. చైర్మన్‌గా కాంగ్రెస్ కౌన్సిలర్‌ను, వైస్ చైర్మన్‌గా బీఆర్‌ఎస్ కౌన్సిలర్‌ను ఎన్నుకోనున్నట్లు సమాచారం. బాన్సువాడ, ఎల్లారెడ్డి, బిచ్కుంద మున్సిపాలిటీలలో కాంగ్రెస్‌కు పూర్తి ఆధిక్యత ఉండడంతో ఆ పార్టీకి చెందినవారే చైర్మన్, వైస్ చైర్మన్‌లుగా ఎన్నిక కానున్నారు.
– సాక్షి ప్రతినిధి, కామారెడ్డి
12 వార్డులున్న ఎల్లారెడ్డి బల్దియాలో 10 స్థానాలను కాంగ్రెస్ పార్టీనే గెలుచుకుంది. అయితే చైర్మన్ పదవిని ఇద్దరు ఆశిస్తుండడంతో పదవిపై స్పష్టత రాలేదు. మొదటినుంచి మాజీ చైర్మన్ పద్మ శ్రీకాంత్ పేరు వినిపిస్తోంది. అయితే ఈ పదవిని మత్తమాల భాగ్యమ్మకు ఇవ్వాలని ఒత్తిడి రావడంతో నిర్ణయాన్ని సస్పెన్స్‌లో ఉంచారు. ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు కౌన్సిలర్లతో మాట్లాడారు. పార్టీ నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలని సూచించారు. వైస్ చైర్మన్ పదవి విషయంలోనూ స్పష్టత రావాల్సి ఉంది.
కామారెడ్డిలో బీఆర్‌ఎస్‌తో అవగాహన
చైర్మన్ పదవి కాంగ్రెస్‌కు,
వైస్ చైర్మన్ బీఆర్‌ఎస్‌కు..
మిగతా మూడు చోట్ల పదవులన్నీ
అధికార పార్టీ ఖాతాలోకే...


