ఉత్సాహం లేని వనమహోత్సవం
బాన్సువాడ రూరల్: పర్యావరణ పరిరక్షణకు ప్రా ధాన్యమిస్తూ గత ప్రభుత్వం పదేళ్లపాటు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం ప్ర స్తుతం నీరుగారిపోతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ర్పడిన తర్వాత హరితహారం పేరను వనమహోత్సవంగా మార్చారు. అయితే ప్రతి ఏటా మొక్కలు నాటే లక్ష్యాన్ని తగ్గించుకుంటూ పోతున్నారని, ఈ కారణంగా పర్యావరణ సమతుల్యం దెబ్బతినే ప్రమాదం ఉందని, కూలీలకు ఉపాధి దొరకడం లేదని పలువురు పేర్కొంటున్నారు.
నత్తనడకన పనులు
గతంలో ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో ప్రత్యేకంగా నర్సరీలు ఏర్పాటు చేసి వేలాది మొక్కలను సిద్ధం చేసేవారు. పెద్ద గ్రామ పంచాయతీల్లో రెండు, మూడుచోట్ల నర్సరీలు ఏర్పాటు చేసేవారు. ప్రస్తుతం వనమహోత్సవ లక్ష్యం తగ్గిపోవడంతో ఉమ్మడి గ్రామ పంచాయతీల వారీగా నర్సీరీలు ఏర్పాటు చేయడానికి అధికారులు ప్రణాళిక చేస్తున్నారు. నవంబర్, డిసెంబర్ నుంచే ఎర్రమట్టి సేకరణ, బ్యాగ్ ఫిల్లింగ్, సీడ్ బిడ్డింగ్ లాంటి పనులు ప్రారంభం అయ్యేవి. ఈసారి అనుమతులు ఆలస్యంగా రావడంతో నర్సరీల్లో మొక్కలు సిద్ధం చేసే పనులు నత్తనడకన సాగుతున్నాయి.
జూన్‌నాటికి సిద్ధమయ్యేనా?
జనవరి నెలాఖరుకు వచ్చినా సీడ్ బిడ్డింగ్, గ్రీన్‌నెట్ ఏర్పాటు, వనసేవకుల నియామకం తదితర పనులు పూర్తిస్థాయిలో ప్రారంభం కాలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. వనమహోత్సవంలో భాగంగా జూన్ వరకు జిల్లాలోని 527 నర్సరీల్లో సుమారు 14లక్షల 46వేల మొక్కలను సిద్ధంగా ఉంచాలని అధికారులు ప్రణాళిక రూపొందించారు.
ప్రతినర్సరీలో నీడనిచ్చే మొక్కలతో పాటు జామ, ఉసిరి, అల్లనేరేడు, చింత, మామిడి, సీతాఫలం, దానిమ్మ, బాదం, కర్జూరవంటి మొక్కలను పెంచాలని నిర్ణయించారు. పండ్లమొక్కలతోపాటే గులాబీ, మల్లె, మందారం తదితర పూల మొక్కలను అందుబాటులో ఉంచాలని ప్రణాళిక చేశారు. కాలం సమీపిస్తున్న తరుణంలో జూన్‌నాటికి మొక్కలు సిద్దమై వనమహోత్సవ లక్ష్యం నెరవేరుతుందో లేదో వేచిచూడాల్సిందే.
సగానికి తగ్గిన లక్ష్యం
గతేడాదితో పోలిస్తే వనమహోత్సవంలో భా గంగా నాటే మొక్కల సంఖ్య దాదాపు సగానికి తగ్గింది. గతేడాది జిల్లాలోని 527 గ్రామ పంచాయతీల్లో 23లక్షల 22వేల మొక్కలు నాటడం లక్ష్యంగా పెట్టుకుని మొక్కలు నాటించారు. కానీ ఈసారి అధికారులు లక్ష్యాన్ని 14 లక్షల 46 వేలకు కుదించారు. గతేడాది ప్రతి గ్రామ పంచాయతీలో సుమారు 4వేల మొక్కలు నాటడమే లక్ష్యంగా నిర్ధేశించుకున్న అధికారులు ఈసారి 2వేల మొక్కలకే పరిమితం చేశారు.
ఏటేటా తగ్గుతున్న ప్రభుత్వ లక్ష్యం
నర్సరీల్లో ప్రారంభానికి
నోచుకోని పనులు
ఈ ఏడాది జిల్లా లక్ష్యం
14లక్షల 46వేల మొక్కలే..


