ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన సదస్సు
బాన్సువాడ రూరల్: బోర్లం గ్రామ పంచాయతీలో గురువారం కెనరాబ్యాంకు, ఎస్‌ఎస్‌టీ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యతలపై అవగాహన సదస్సు నిర్వహించారు. బ్యాంకులు, అవి అందించే సేవలు, సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ఏటీఎం, డిజిటల్స్ పేమెంట్స్, బీమా పథకాలు, సుకన్య సమృద్ధి యోజన తదితర పథకాల గురించి గ్రామస్తులకు వివరించారు. సర్పంచ్ రమేష్, ఉప సర్పంచ్ బస్వయ్య, కార్యదర్శి సాయికుమార్, ఎస్‌బీఐ అసిస్టెంట్ మేనేజర్ మణిశంకర్, సీఎఫ్‌ఎల్ కౌల్సిలర్స్ పర్వయ్య, అనుదీప్, సుధీర్‌కుమార్ గ్రామస్తులు పాల్గొన్నారు.


