కాంగ్రెస్‌ పాలనలో స్వర్ణయుగం | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ పాలనలో స్వర్ణయుగం

Feb 8 2026 4:15 AM | Updated on Feb 8 2026 4:15 AM

కాంగ్రెస్‌ పాలనలో స్వర్ణయుగం

కాంగ్రెస్‌ పాలనలో స్వర్ణయుగం

కామారెడ్డి టౌన్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో స్వర్ణయుగ పాలన కొనసాగుతోందని మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్‌ పేర్కొన్నారు. శనివారం ఆ యన కామారెడ్డి పట్టణంలోని 19వ వార్డు నుంచి 25వ వార్డు వరకు మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడు తూ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తున్నామన్నారు. రైతు భ రోసా కింద ఎకరాకు రూ. 6 వేల పెట్టుబడి సాయం అందిస్తున్నామని, రెండేళ్లలో 51 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని పేర్కొన్నారు. మైనారిటీల సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. కా మారెడ్డిలో అభివృద్ధి కొనసాగాలంటే కాంగ్రెస్‌ను గె లిపించాలని ప్రజలను కోరారు. వెంకటరమణారెడ్డి ఎమ్మెల్యే అయ్యాక ఈ ప్రాంతానికి చేసిందేమీ లేద ని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ పేర్కొన్నారు. గతంలో ఏమీ చేయని వ్యక్తి, భవిష్యత్‌లో చేస్తాడనే నమ్మకం ప్రజలకు లేదన్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులను ఓడించానని చెప్పుకోవడం తప్ప, కామారెడ్డికి ఆయన సాధించిన ఘనత శూన్యమని పేర్కొన్నారు. ప్రచార కార్యక్రమంలో మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ నేరెళ్ల శారద, కాంగ్రెస్‌ అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

నేడు బిచ్కుంద, ఎల్లారెడ్డిలలో ప్రచారం..

నిజాంసాగర్‌: మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్‌ ఆదివారం జిల్లాలో పర్యటించనున్నారని డీసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ తెలిపారు. బిచ్కుంద, ఎల్లారెడ్డిలలో మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారన్నారు. కార్యక్రమాలను విజయవంతం చేయాలని ప్రజలను కోరారు.

ఆరు గ్యారంటీలు అమలు చేస్తున్నాం

రైతు భరోసా కింద ఎకరానికి

రూ. 6 వేలు ఇస్తున్నాం

ఎన్నికల ప్రచారంలో మైనారిటీ

సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్‌

Advertisement
 
Advertisement
Advertisement