అనారోగ్య సమస్యలతో వివాహిత ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

అనారోగ్య సమస్యలతో వివాహిత ఆత్మహత్య

Feb 16 2026 7:37 AM | Updated on Feb 16 2026 7:37 AM

అనారోగ్య సమస్యలతో వివాహిత ఆత్మహత్య

అనారోగ్య సమస్యలతో వివాహిత ఆత్మహత్య

అనారోగ్య సమస్యలతో వివాహిత ఆత్మహత్య సోమారంలో గుడిసె దగ్ధం

తాడ్వాయి(ఎల్లారెడ్డి): అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఓ వివాహిత ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తాడ్వాయి మండలం దేమికలాన్‌ గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై నరేశ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మర్రి సంగమణి(49) అనే మహిళ కొన్ని రోజులుగా ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధితో బాధపడుతోంది. కుమారుడు రాజు ఇటీవల ఆమెకు ఆస్పత్రిలో వైద్యం చేయించి స్వగ్రామానికి తీసుకొచ్చాడు. జీవితంపై విరక్తితో శనివారం అర్ధరాత్రి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి కుమారుడు రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు.

తాడ్వాయి(ఎల్లారెడ్డి): తాడ్వాయి మండలంలోని సోమారం గ్రామంలో నివాసపు గుడిసె దగ్ధమైనట్లు గ్రామస్తులు ఆదివారం తెలిపారు. గ్రామానికి చెందిన ముత్యంగారి శకుంతల శనివారం రాత్రి తన నివాసపు గుడిసెకు తాళం వేసి వేరే గ్రామానికి వెళ్లిందన్నారు. అర్ధరాత్రి ప్రమాదవశాత్తు గుడిసెకు నిప్పంటుకోవడంతో గుడిసెలో ఉన్న బియ్యం, బట్టలు, నగదు, ఇతర వస్తువులు కాలిపోయాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. ప్రమాంలో రూ. లక్ష ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితురాలు తెలిపారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement