ఉత్సవాలకు శివరాంమందిరం ముస్తాబు
దోమకొండ: మండల కేంద్రంలోని శివరాంమందిరం మహాశివరాత్రి ఉత్సవాలకు ముస్తాబైంది. గురువారం నుంచి ఈ నెల 16 వరకు ఉత్సవాలు నిర్వహిస్తామని ఆలయ కమిటీ చైర్మన్ కొండ అంజయ్య తెలిపారు. శివుడు, రాముడు కొలువైన ఆలయంగా శివరాంమందిరానికి పేరు ఉంది. దోమకొండతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి భారీగా భక్తులు ఉత్సవాలకు తరలివస్తారు. ఈ సందర్భంగా వివిధ పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఉత్సవాల కోసం ఆలయాన్ని రంగులు విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు.
నేటి నుంచి సాయిబాబా ఆలయ వార్షికోత్సవాలు
దోమకొండ: మండల కేంద్రంలోని సాయిబాబా ఆలయంలో గురువారం నుంచి రెండు రోజుల పాటు జరుగనున్న 31వ వార్షికోత్సవాలకు ఆలయాన్ని ముస్తాబు చేశారు. నేడు , రేపు వివిధ పూజా కార్యక్రమాలతో పాటు అన్నదానం ఉంటుందని ఆలయ కమిటీ ప్రతినిధులు జగదీష్ తెలిపారు. ఆలయాన్ని అందంగా అలంకంరించారు.


