సీసీ కెమెరాలతో గ్రామ భద్రత బలోపేతం
పెద్దకొడప్‌గల్): గ్రామ భద్రతా వ్యవస్థను బలోపేతం చేసే దిశగా సీసీ కెమెరాలు ఉపయోగపడుతాయని ఎంపీడీవో అభినవ్ చందర్ పేర్కొన్నారు. కాస్లాబాద్‌లో గ్రామ పంచాయతీ నిధులతో ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఎంపీడీవో అభినవ్ చందర్ ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ చైతన్ యాదవ్ మాట్లాడుతూ.. సీసీ కెమెరాలతో నేరాలను నిరోధించడంతో పాటు ప్రజల్లో భద్రతాభావం పెరుగుతుందని అన్నారు. గ్రామంలో 8 చోట్ల సీసీ కెమెరాలు అమర్చినట్లు తెలిపారు. పంచాయతీ కార్యదర్శి శివాజీ, ఉప సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): పోచారం, మాల్తుమ్మె ద గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను బుధవారం హౌసింగ్ డీఈఈ సుష్మ, ఏఈ అస్మా తబస్సుమ్ పరిశీలించారు. నిబంధనల ప్రకారం కొలతలకు అనుగుణంగా ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలని లబ్ధిదారులకు వారు సూచించారు. ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని చెప్పారు. మాల్తుమ్మెద ఫీల్డ్ అసిస్టెంట్ సాయిలు ఉన్నారు.
లింగంపేట(ఎల్లారెడ్డి): శెట్పల్లిసంగారెడ్డిలో బుధవారం ఉపాధి హామీ పనులను సర్పంచ్ కత్తుల లక్ష్మి ప్రారంభించినట్లు తెలిపారు. గ్రామంలోని కూలీలకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి పనులు చేపట్టినట్లు ఆమె పేర్కొన్నారు. కూలీలు అధిక సంఖ్యలో పాల్గొనేలా చూడాలని కార్యదర్శి, క్షేత్రసహాయకులకు సూచించారు. కుంటలో పూడికతీత పనులు వేగవంతం చేయాలని సూచించారు. కూలీలు సమయపాలన పాటించాలన్నారు. ఉపసర్పంచ్ నీల రాజు, అంజయ్య, క్షేత్రసహాయకుడు సతీష్, కార్యదర్శి, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
పెద్దకొడప్‌గల్(జుక్కల్): సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పేదకుటుంబాలకు ఆర్థిక భరోసా ఇస్తున్నా యని పోచారం గ్రామ సర్పంచ్ బాలాజీ పటేల్ పేర్కొన్నారు. బుధవారం పోచారం గ్రామానికి చెందిన సాయిలు కుటుంబానికి రూ.60 వేల విలువైన చెక్కులను అందజేశారు. ఉప సర్పంచ్ మేత్రి రాజు, తదితరులు పాల్గొన్నారు.
సదాశివనగర్(ఎల్లారెడ్డి): కుప్రియాల్ గ్రామానికి చెందిన కాలభైరవ భజన మండలి సభ్యులు తిరుమలలో భజన కీర్తనలు ఆలపించారు. అఖండ హరినామ సంకీర్తన కార్యక్రమంలో భాగంగా కీర్తనలు ఆలపించినట్లు వారు పేర్కొన్నారు.
సీసీ కెమెరాలతో గ్రామ భద్రత బలోపేతం
సీసీ కెమెరాలతో గ్రామ భద్రత బలోపేతం
సీసీ కెమెరాలతో గ్రామ భద్రత బలోపేతం
సీసీ కెమెరాలతో గ్రామ భద్రత బలోపేతం


