ఆ నలుగురు కాంగ్రెస్‌లోకి.. వెళ్లలేదు!
కామారెడ్డి టౌన్: కామారెడ్డి బల్దియాలో బీఆర్‌ఎస్ టికెట్టుపై గెలిచిన నలుగురు కౌన్సిలర్లు కాంగ్రెస్‌లో చేరినట్లు ఆదివారం సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఇది పట్టణంలో చర్చనీయాంశమైంది. బీఆర్‌ఎస్‌కు చెందిన 18వ వార్డు కౌన్సిలర్ మిర్జా హఫీజ్ బేగ్, 45, 46, 47 వార్డుల కౌన్సిలర్లు పిట్ల వేణు, గెరిగంటి లక్ష్మీనారాయణ, స్వప్న కాంగ్రెస్ గూటికి చేరారన్న వార్త వైరల్ అయ్యింది. అయితే వెంటనే బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు రంగంలోకి దిగారు. తాము పార్టీ మారలేదని, బీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతున్నామని స్పష్టత ఇచ్చారు. పార్టీ మారారని ప్రచారం జరిగిన నలుగురు కౌన్సిలర్లు మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజీబొద్దీన్‌లతో కలిసి ఉన్న వీడియోలను విడుదల చేశారు.


