సీఎం కప్ పోటీల్లో ప్రతిభ
బాన్సువాడ రూరల్: సీఎంకప్ బాన్సువాడ నియోజకవర్గ పోటీల్లో బాన్సువాడ జోన్ క్రీడాకారులు సత్తాచాటీ చాంపియన్‌షిప్ సాధించినట్లు పీడీ తారాచంద్, సురేందర్‌లు శనివారం తెలిపారు. వాలీబాల్ బాలుర, బాలికల విభాగాల్లో నస్రుల్లాబాద్ ప్రథమస్థానం సాధించిందని, ఖోఖోలో బాలుర, బాలికల విభాగాల్లో బీర్కూర్ మండలం ద్వితీయ స్థానం సాధించిందన్నారు. కబడ్డీలో కొత్తాబాది(బాన్సువాడ మండలం) బాలికలు, బాలుర విభాగాల్లో మొదటి స్థానాలు సాధించారన్నారు. నియోజకవర్గ స్థాయిలో 9మండలాల క్రీడాకారులు పాల్గొనగా బాన్సువాడ జోన్ క్రీడాకారులు విజేతలుగా నిలిచారన్నారు. పాల్గొన్న క్రీడాకారులు, పీఈటీలకు వారు అభినందనలు తెలిపారు.


