హోటళ్లలో గృహవినియోగ సిలిండర్లు వాడొద్దు
లింగంపేట(ఎల్లారెడ్డి): హోటళ్లు, దాబాల్లో గృహాలకు వినియోగించే సిలిండర్లు వాడడం విరుద్దమని జిల్లా సివిల్ సప్లయ్ అధికారులు అన్నారు. మండల కేంద్రంలోని పలు హోటళ్లు, దాబాలపై శనివారం వారు దాడులు నిర్వహించారు. ఈసందర్భంగా 18 గృహ వినియోగం సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు. ఏఎస్‌వో స్వామి మాట్లాడుతూ.. హోటళ్ల నిర్వాహకులు డొమెస్టిక్ సిలిండర్లు వాడితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. వ్యాపార, వాణిజ్య సంస్థలకు ఉపయోగించే సిలిండర్లు మాత్రమే వాడాలని సూచించారు. స్వాధీనం చేసుకున్న 18 సిలిండర్లను సదరు గ్యాస్ ఏజెన్సీకి అప్పగించారు. డీటీలుసురేష్, షరీఫ్, సిబ్బంది ఉన్నారు.
జిల్లాకేంద్రంలో 30 సిలిండర్లు..
కామారెడ్డి క్రైం: జిల్లా కేంద్రంలోని పలు హోటళ్లు, టిఫిన్ సెంటర్లలో ఏఎస్‌వో రవీందర్ రాథోడ్ ఆధ్వ ర్యంలో సివిల్ సప్లయ్ అధికారులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఈసందర్భంగా గృహ అవసరాల కు వినియోగించాల్సిన సిలిండర్లను నిబంధనలకు విరుద్దంగా వ్యాపార అవసరాలకు వాడుతున్నట్లు గుర్తించారు. ఇలాంటి 30 సిలిండర్లను స్వాధీనం చేసుకుని 19 మంది వ్యాపారులపై కేసులు నమో దు చేసినట్లు సివిల్ సప్లయ్ డిప్యూటీ తహసీల్దార్ కిష్టయ్య తెలిపారు. సిలిండర్లను కామారెడ్డిలోని ఓ గ్యాస్ ఏజెన్సీలో భద్రపరిచినట్లు వెల్లడించారు. డీటీ తిరుపతి, సిబ్బంది పాల్గొన్నారు.
హోటళ్లలో గృహవినియోగ సిలిండర్లు వాడొద్దు


