కార్మికుల హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వాలు
● సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి
పాలడుగు సుధాకర్
● దేశవ్యాప్త సమ్మెలో భాగంగా
కామారెడ్డిలో కార్మికుల భారీ ర్యాలీ
కామారెడ్డి టౌన్: కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు గురువారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె గురువారం విజయవంతమైంది. సీఐటీయూ ఆధ్వర్యంలో స్థాని క మున్సిపల్ కార్యాలయం నుంచి నిజాంసాగర్ చౌరస్తా వరకు కార్మికులతో భారీ ర్యాలీ నిర్వహించా రు. అనంతరం మున్సిపల్ ఆఫీస్ ఎదుట నిర్వహించిన బహిరంగ సభలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పాలడుగు సుధాకర్ మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తూ, కార్మికులు పోరాడి సాధించుకున్న 29 చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్‌లను తీసుకురావడం దారు ణమన్నారు. దీని కారణంగా 8 గంటల పనిదినం మృగ్యమవుతాయని, కార్మికులు బానిసలుగా మారే ప్రమాదం ఉందని తెలిపారు. తక్షణమే ఈ నిర్ణయాలను ఉపసంహరించుకోవాలి డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షుడు కందారపు రాజనర్సు, కన్వీనర్ అరుణ్ మాట్లాడుతూ..
అంగన్‌వాడీ, ఆశ, మధ్యాహ్న భోజన, మున్సిపల్ కార్మికులను కనీసం కార్మికులు గా కూడా గుర్తించకపోవడం శోచనీయమన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్, మున్సిపల్ యూ నియన్ నాయకులు మహబూబ్, దీవెన, శివరాజు, ఆశ వర్కర్ల ప్రతినిధులు రాజశ్రీ, ఇంద్ర, అంగన్‌వాడీ నాయకులు బాబాయ్, లక్ష్మి, మధ్యాహ్న భోజనం వర్కర్ల సంఘం నాయకులు వెంకటేశ్, గ్రామపంచాయతీ కార్మికుల సంఘం అధ్యక్షుడు బాలనర్సు, భారీ సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.


