త్రిలింగ రామేశ్వరాలయానికి విరాళం
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): తాండూర్ శివారులో గల త్రిలింగరామేశ్వరాలయ అభివృద్ధి కోసం హైద్రాబాద్‌కు చెందిన హైకోర్టు సీనియర్ అడ్వొకేట్ పామిడిగంటం శ్రీరఘురాం రూ.70 వేలు విరాళంగా అందజేశారు. ఆలయాన్ని కుటుంబసభ్యులతో కలిసి ఆదివారం రాత్రి ఆయన దర్శించుకున్నారు. ప్రత్యేకపూజలు చేశారు. అనంతరం శ్రీరఘురాం దంపతులను ఆలయకమిటీ సభ్యులు సత్కరించారు. ఆలయకమిటీ చైర్మన్ దత్తు, తాండూర్, అక్కంపల్లి గ్రామాల సర్పంచ్‌లు భూమా యాదగౌడ్, వెంకాగౌడ్, నాయకులు సురేందర్‌రెడ్డి, సతీష్‌తోపాటు ఆలయకమిటీ సభ్యులు పాల్గొన్నారు.
కామారెడ్డి అర్బన్: ఏనభైఏళ్ల చరిత్ర కల్గిన తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం(టీఎన్జీవోస్)పై అసత్య ప్రచారాలు మానుకోవాలని టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నరాల వెంకట్‌రెడ్డి, ముల్క నాగరాజు హితవు పలికారు. ఆదివారం టీఎన్జీవోస్ కామారెడ్డి జిల్లా భవన్‌లో జిల్లా ప్రతినిధులతో కలిసి అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించడంలో టీఎన్జీవోస్ ముందుండి ఉద్యమించిందని, ఇలాంటి సంఘంపై అసత్య ఆరోపణలు సమంజసం కాదన్నారు. సంఘంలో గెజిటెడ్ అధికారులు ఎవరూ లేరని స్పష్టం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అనేక ఉపాధ్యాయ సంఘాలుండగా తెలంగాణలో వాటికి ప్రభుత్వ గుర్తింపు వచ్చిందని, టీఎన్జీవోస్‌తో కలిసి పనిచేసే వారిని కొనసాగిస్తే కడుపుమంట ఎందుకని ప్రశ్నించారు. నేతలు ఎం.చక్రధర్, ఎం.దేవరాజు, శ్రీనివాస్‌రెడ్డి, లక్ష్మణ్‌లు పాల్గొన్నారు.
కామారెడ్డి టౌన్: రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్, కామారెడ్డి కాంగ్రెస్ ఇన్‌చార్జి నేరెళ్ల శారదను కామారెడ్డి కల్లు గీత పారిశ్రామిక సహకార సొసైటీ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఆదివారం ఆమె సిరిసిల్లారోడ్‌లోని ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మేరకు సంఘ సభ్యులు ఆమెకు పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సత్కరించారు. నేతలు బండారి రాజాగౌడ్, నాడేం శ్రీధర్ గౌడ్, అమరసింహ గౌడ్, ప్రదీప్ గౌడ్, రామచంద్రం గౌడ్, హరికిషన్ గౌడ్, వేణుగోపాల్ గౌడ్ పాల్గొన్నారు.
త్రిలింగ రామేశ్వరాలయానికి విరాళం
త్రిలింగ రామేశ్వరాలయానికి విరాళం


