కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టండి
ఎల్లారెడ్డిరూరల్: కాంగ్రెస్ పార్టీకి ఓటర్లు పట్టం కట్టాలని ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు కోరారు. శుక్రవారం పట్టణంలోని పలు వార్డులలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా ఇంటింటికి తిరుగుతూ ఓటర్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేయాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే యూసుఫ్ అలీ, 10వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి పద్మ శ్రీకాంత్, తదితరులున్నారు.
చెక్కుల పంపిణీ
ఎల్లారెడ్డి: మండలంలోని పలు గ్రామాల డబుల్ బెడ్‌రూం లబ్ధిదారులకు ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు శుక్రవారం చెక్కులను అందించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. డబుల్ బెడ్‌రూంలు నిర్మించుకున్న వారికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసి అండగా నిలుస్తున్నదన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కాంగ్రెస్ పాలనలోనే జరుగుతోందన్నారు.
క్యాలెండర్ ఆవిష్కరణ
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): తాండూర్‌లోని త్రిలింగరామేశ్వరాలయం క్యాలెండర్‌ను శుక్రవారం ఎల్లారెడ్డిలో ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు చేతులమీదుగా ఆవిష్కరించారు. ఆలయ కమిటీ చైర్మన్ కొమ్మదత్తు, తాండూర్ సర్పంచ్ భూమా యాదగౌడ్, ఉపసర్పంచ్ అభిషేక్, ఇతర గ్రామాల సర్పంచ్‌లు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టండి


