పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి | - | Sakshi
Sakshi News home page

పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి

Feb 11 2026 7:46 AM | Updated on Feb 11 2026 7:46 AM

పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి

పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి

ఎల్లారెడ్డి: మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు ఆర్డీవో పార్థసింహారెడ్డి తెలిపారు. మంగళవారం ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌లో పోలింగ్‌ సిబ్బందికి సామగ్రిని అందజేశారు. ఎల్లారెడ్డిలో 12 వార్డులకు గాను 24 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 24 పోలింగ్‌ కేంద్రాలకు గాను 24 మంది పీవోలు, 24 మంది ఏపీవోలు, 72 మంది ఓపీవోలు, ఆరుగురు మైక్రో అబ్జర్వర్లు, 22 మంది రిజర్వు సిబ్బందిని కేటాయించినట్లు వెల్లడించారు.

సరిపడా వాహనాల ఏర్పాటు

ఎల్లారెడ్డిరూరల్‌: పోలింగ్‌ సిబ్బందితో పాటు సామగ్రిని తరలించేందుకు సరిపడా వాహనాలను ఏర్పాటు చేసినట్లు ఏఎంవీఐ మహ్మద్‌ రఫీక్‌ మంగళవారం తెలిపారు. 7 బస్సులు, రెండు కార్లు ఏర్పాటు చేయడంతో పోలింగ్‌ సామగ్రితో సిబ్బంది పోలింగ్‌ కేంద్రాలకు తరలివెళ్లారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement