ఆదర్శ మున్సిపాలిటీగా మారుస్తాం | - | Sakshi
Sakshi News home page

ఆదర్శ మున్సిపాలిటీగా మారుస్తాం

Feb 9 2026 7:28 AM | Updated on Feb 9 2026 7:28 AM

ఆదర్శ మున్సిపాలిటీగా మారుస్తాం

ఆదర్శ మున్సిపాలిటీగా మారుస్తాం

నిజాంసాగర్‌(జుక్కల్‌): వెనుకబడిన ప్రాంతంగా పేరొందిన జుక్కల్‌ నియోజకవర్గంతో పాటు బిచ్కుంద మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా మారుస్తామని మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్‌ అన్నారు. సీఎం రేవంత్‌ రెడ్డి కృషి, ఎమ్మెల్యే చొరవతో జుక్కల్‌ నియోజకవర్గం రూపురేఖలు మారుస్తామన్నారు. ఆదివారం బిచ్కుంద మున్సిపాలిటీ ఎన్నికల కార్నర్‌ సభలో మంత్రి మాట్లాడారు. జుక్కల్‌ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు ఉన్నత విద్యావంతుడని, నియోజకవర్గం అభివృద్ధికి పట్టుదలతో గొప్ప సంకల్పంతో ముందుకు వెళ్తున్నాడన్నారు. 12 స్థానాల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

కేటీఆర్‌కు అహంకారం పోలేదు: ఎమ్మెల్యే

బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు అధికారం పోయినా అహంకారం మాత్రం తగ్గలేదని జుక్కల్‌ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు విమర్శించారు. ఆదివారం మంత్రి అజారుద్దీన్‌తో కలిసి బిచ్కుందలో కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల కార్నర్‌ సభలో ఎమ్మెల్యే మాట్లాడారు. 2019 ఎన్నికల్లో కేటీఆర్‌ సిరిసిల్ల నుంచి 171 ఓట్లతో గెలిచిన సంగతి మర్చిపోయాడన్నారు. అలాంటి వ్యక్తి బిచ్కుందకు వచ్చిన తన మెజార్టీ గురించి మాట్లడటం హాస్యాస్పదంగా ఉందని చెప్పారు. జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు ఏలె మల్లికార్జున్‌, నాయకులు సాయిపటేల్‌ తదితరులు ఉన్నారు.

కార్నర్‌ సభలో మంత్రి అజారుద్దీన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement