అందరి లెక్కలు సరి చేస్తాం
● మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్
బాన్సువాడ :ఈ రెండున్నర ఏళ్లలో పోచారం శ్రీనివా స్‌రెడ్డి బాన్సువాడకు ఎన్ని నిధులు తెచ్చారో ప్రజలకు చెప్పాలని, గత సర్పంచ్ ఎన్నికల్లో కోటగిరి మండల కేంద్రం తప్ప మిగతా మేజర్ పంచాయతీల్లో బీఆర్‌ఎస్,బీజేపీ అభ్యర్థులే సర్పంచులుగా విజయం సా ధించారని మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నా రు.కాంగ్రెస్ నాయకులు బీఆర్‌ఎస్ కార్యకర్తలను బె దిరిస్తున్నారని,అందరి లెక్కలు సరి చేస్తామని హె చ్చరించారు. సోమవారం బాన్సువాడలోని 9వ అభ్యర్థి తేలి లక్ష్మి స్వరూపకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ నుంచి యువకులు పోటీ చేస్తున్నారని, ప్రజలు బీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించాలని విన్నవించారు. 9వ వార్డు అభ్యర్థి తేలి లక్ష్మి స్వరూప, 13వ వార్డులో బీఆర్‌ఎస్ అభ్యర్థి బాడి శ్రీనివాస్‌కు మద్దతుగా ప్రచారం చేశారు. బీఆర్‌ఎస్ నాయకులు అంజిరెడ్డి, గాండ్ల కృష్ణ, మహేష్, బాడి శ్రీనివాస్, అక్బర్, లయక్, చందర్, సాయిబాబా తదితరులున్నారు.


