వందశాతం పన్ను వసూళ్లకు ప్రణాళిక
● జిల్లా పంచాయతీ అధికారి మురళి
● భిక్కనూరు జీపీ తనిఖీ
భిక్కనూరు: జిల్లావ్యాప్తంగా వందశాతం ఇంటి పన్నుల వసూళ్లకు ప్రణాళిక రూపొందించినట్లు జిల్లా పంచాయతీ అధికారి మురళి అన్నారు. భిక్కనూరు గ్రామపంచాయతీని శనివారం ఆయన సందర్శించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఇంటి పన్నులను వందశాతం వసూలు చేయడం వల్ల గ్రామాలు వేగవంతంగా అభివృద్ధి చెందుతాయన్నారు. రానున్న వేసవిలో ఎలాంటి నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శులకు సూచనలు, సలహాలను అందజేశామన్నారు.15వ ఆర్థికసంఘం నిధులు త్వరలో గ్రామపంచాయతీ ఖాతాల్లో జమ కానున్నందున వెంటనే చెల్లింపులు జరపాలని జిల్లాలోని ఎంపీవోలకు ఆయన టెలికాన్ఫరెన్స్ ద్వారా ఆదేశాలు ఇచ్చారు. ఈవో మహేష్‌గౌడ్ తదితరులు ఉన్నారు.


