బల్దియాపై కాంగ్రెస్ జెండా ఎగరాలి
బాన్సువాడ: బాన్సువాడ బల్దియాపై కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని డీసీసీబీ మాజీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలోని 11వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి గడుమల లింగమేశ్వర్‌కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఏ బల్దియాలో జరగని అభివృద్ధిని బాన్సువాడలో చేసిన ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్‌రెడ్డి రుణం తీర్చుకోవాలంటే 19 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులందరినీ గెలిపించాలని అన్నారు. ప్రతి వార్డులో డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇచ్చిన ఘనత పోచారంకే దక్కిందన్నారు. గతంలో 11వ వార్డులో కౌన్సిలర్‌గా పని చేసిన లింగంకు ప్రజల అభిమానం ఉందని, ఈ సారి లింగంను గెలిపించుకుంటే మిగిలిన వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజురు చేస్తామన్నారు. నేతలు కృష్ణారెడ్డి, గులేపల్లి శంకర్, జిన్న రఘు, జీవన్, మల్లారెడ్డి, లక్ష్మణ్, నారాయణ, కొంకి విఠల్, గులేపల్లి రమేష్, అనిత ఉన్నారు.


