బృందావన్ కాలనీలో భారీ చోరీ
● 16 తులాల బంగారం అపహరణ
కామారెడ్డి క్రైం: జిల్లా కేంద్రంలోని హౌసింగ్‌బోర్డు బృందావన్ కాలనీలో గురువారం భారీ చోరీ ఘటన వెలుగు చూసింది. కాలనీకి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు శ్రీలేఖ తన ఇంటికి తాళం వే సి బుధవారం రాత్రి దేవునిపల్లిలోని తన తల్లిగారింటికి వెళ్లారు. ఉదయాన్నే వచ్చి చూసేసరికి తాళం పగులగొట్టి ఉంది. దుండగులు చోరీకి పాల్పడినట్లు గుర్తించిన ఆమె పోలీసులకు సమాచారం ఇచ్చారు. పట్టణ, సీసీఎస్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించారు. ఇంట్లో దాచి ఉంచిన 16 తులాల బంగారం, 5 తులాల వెండి, కొంత నగదు చోరీకి గురైనట్లు బాధితురాలు తెలి పారు. పోలీసులు విచారణ చేపట్టారు.
కామారెడ్డి అర్బన్: సీఎం కప్ జిల్లా స్థాయి యోగా పోటీలు గురువారం జిల్లా కేంద్రంలోని యోగా భవన్‌లో నిర్వహించగా డీఈవో రాజు, యోగా అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు యోగా రాంరెడ్డిలు ప్రారంభించారు. అన్ని క్రీడల్లోనూ యోగా అత్యంత కఠినమైన్పటికి పెద్ద ఎత్తున పోటీల్లో పాల్గొనడంపై డీఈవో రాజు సంతోషం వ్యక్తం చేశారు. విజేతలను అభినందించారు. యోగా పోటీ ల నిర్వహణ, న్యాయనిర్ణేతలు బి.రఘుకుమార్, పెట్టిగాడి అంజయ్య, అనిల్‌కుమార్, బాల్‌రాజు, రాజ్‌కుమార్, గురుచరణ్, బాల్‌లింగం, భరత్, వాసు, శ్రీలత, గోమతి, వీణ, లలిత, లావణ్య, హిమబిందులు వ్యవహరించగా, సాంకేతిక ప్రతినిధులు గంగాప్రసాద్, రమేష్, యోగాచార్యులు అంజయ్యగుప్తా ఉన్నారు.
మాచారెడ్డి: లచ్చాపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థిని పూస నితీష రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికై ంది. ఈవిషయమై గురువారం పాఠశాలలో ఆమెను సత్కరించారు. పాఠశాల హెచ్‌ఎం నాగేశ్వర్‌రెడ్డి, పీఈటీ నర్సింలు, ఉపాధ్యాయులు అభినందించారు.
రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలకు..
పాల్వంచ మండల కేంద్రంలోని ఉన్నత పా ఠశాలకు చెందిన ఖోఖో జట్టు రా ష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు ఎంపికైంది. కా మారెడ్డి జిల్లా స్థాయిలో గురువారం జరిగిన సీఎం కప్ పోటీల్లో ఈ జట్టు ప్రతిభ చూపి రాష్ట్రస్థాయికి ఎంపికై ందని పాఠశాల హెచ్‌ఎం గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. పీడీ అతీక్‌లతో పాటు ఎంపికై న జట్టును అభినందించారు.
పాస్‌లు ఉంటేనే అనుమతి
నిజామాబాద్ అర్బన్: మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో నిజామాబాద్ నగరంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఆంక్షలు వి ధించారు. కౌంటింగ్ కేంద్రం నుంచి 5 కి లోమీటర్ల వరకు ఐదుగురి కంటే ఎక్కువ మంది గుమిగూడొద్దని ఆదేశాలు జారీ చేశారు.
దారి మళ్లింపు:
నిజామాబాద్ నగరంలో వాహనాల దారి మళ్లింపు ఉంటుందని సీపీ సాయిచైతన్య తెలిపారు. ఆర్మూర్, హైదరాబాద్ ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రానికి వచ్చే ఆర్టీసీ బస్సు లు, ఇతర వాహనాలు బైపాస్ రోడ్డు గుండా కలెక్టరేట్ మీదుగా కాలూరు, ఖానాపూర్ జంక్షన్ నుంచి దుబ్బ చౌరస్తా వరకు, అక్కడి నుంచి శివాజీ విగ్రహం, రైల్వే ఫ్లైఓవర్ మీ దుగా బస్టాండ్‌కు చేరుకోవాలని పేర్కొన్నా రు. బోధన్, బాన్సువాడ నుంచి వచ్చే వాహనాలు రాకపోకల్లో ఎలాంటి మార్పు లేదని తెలిపారు.
బృందావన్ కాలనీలో భారీ చోరీ
బృందావన్ కాలనీలో భారీ చోరీ
బృందావన్ కాలనీలో భారీ చోరీ


