పారిశుద్ధ్య పనులు నిరంతరం సాగాలి | - | Sakshi
Sakshi News home page

పారిశుద్ధ్య పనులు నిరంతరం సాగాలి

Feb 8 2026 4:02 AM | Updated on Feb 8 2026 4:02 AM

పారిశుద్ధ్య పనులు నిరంతరం సాగాలి

పారిశుద్ధ్య పనులు నిరంతరం సాగాలి

లింగంపేట(ఎల్లారెడ్డి): గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు నిరంతరంగా సాగాలని ఎల్లారెడ్డి డీఎల్‌పీవో సురేందర్‌ అన్నారు. మండలంలోని శెట్పల్లి గ్రామ పంచాయతీని శనివారం ఆయన తనిఖీ చేశారు. ఈసందర్భంగా సురేందర్‌ మాట్లాడుతూ.. గ్రామంలో రాబోయో వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా చూడాలని సిబ్బందికి సూచించారు. అనంతరం ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను సందర్శించారు. ఇటీవల సీఎం కప్‌ విజేతలుగా నిలిచిన విద్యార్థులను అభినందించారు. గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. కోతుల బెడదను నివారించడానికి చేపడుతున్న పనులను పరిశీలించి సర్పంచ్‌ను అభినందించారు. సర్పంచ్‌ అట్టెం శ్రీనివాస్‌, ఉపసర్పంచ్‌ బాలయ్య, అశోక్‌, అంజాగౌడ్‌, పద్మ, లింగాగౌడ్‌, రుక్మవ్వ, అంజనేయులు, రాజమణి, తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement