విద్యార్థుల కోసం ప్రత్యేక బస్సులు నడపాలి
కామారెడ్డి టౌన్: విద్యార్థుల కోసం సరిపడా బస్సులు కల్పించాలని ఏబీవీపీ నాయకులు గురువారం కామారెడ్డి డిపో అసిస్టెంట్ మేనేజర్ కృష్ణమూర్తిని కోరారు. ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. అనంతరం నేతలు మాట్లాడుతూ.. బస్సులు సకాలంలో రాకపోవడం వల్ల విద్యార్థులు కళాశాలలకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నారని, ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో, గ్రామీణ ప్రాంత విద్యార్థుల కోసం అదనపు బస్సులతో పాటు ఎక్స్‌ప్రెస్ సర్వీసుల్లో కూడా విద్యార్థులను అనుమతించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఏబీవీపీ నగర కార్యదర్శి సంజయ్, నేతలు అల్తాఫ్, స్వస్తిక్, తదితరులు పాల్గొన్నారు.
రిక్వెస్ట్ స్టాప్‌లు పెంచాలి
బీబీపేట: జనగామలో ఆర్టీసీ రిక్వెస్ట్ స్టాప్‌లను పెంచాలని కోరుతూ గురువారం గ్రామ సర్పంచ్ మట్ట శ్రీనివాస్ ఆధ్వర్యంలో కామారెడ్డి ఆర్టీసీ డిపో మేనేజర్‌కు వినతి పత్రం అందజేశారు. అలాగే గతంలో జనగామ నుంచి కామారెడ్డి కాలేజీలకు వెళ్లే విద్యార్థులకు ఉదయం షెట్విన్ బస్ అందుబాటులో ఉండేదని, ప్రస్తుతం అది రాకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. దీనిని గమనించి విద్యార్థుల కోసం ఉదయం అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. ఉప సర్పంచ్ పాత స్వామి, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
విద్యార్థుల కోసం ప్రత్యేక బస్సులు నడపాలి


