నేడే ఎల్లారెడ్డి మున్సిపల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక | - | Sakshi
Sakshi News home page

నేడే ఎల్లారెడ్డి మున్సిపల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక

Feb 16 2026 7:37 AM | Updated on Feb 16 2026 7:37 AM

నేడే

నేడే ఎల్లారెడ్డి మున్సిపల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన

నేడే ఎల్లారెడ్డి మున్సిపల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక అదుపు తప్పి పొలంలో పడిన బైక్‌

ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు

ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి మున్సిపల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు ఆదివారం తెలిపారు. సోమవారం మున్సిపల్‌ కౌన్సిలర్లు హాజరు కాగానే వారితో చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక నిర్వహిస్తామన్నారు. చైర్మన్‌ అభ్యర్థిని కౌన్సిలర్లు ఒకరు ప్రతి పాదిస్తారని, మరొకరు బలపరుస్తారన్నారు. అనంతరం చేతులెత్తే పద్ధతి ద్వారా ఎన్నిక జరుగుతుందని తెలిపారు.

పదవులన్నీ కాంగ్రెస్‌ పార్టీకే...

ఎల్లారెడ్డి మున్సిపల్‌లో 12 వార్డులకు 10 వార్డులు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు గెలుపొందడంతో చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవి వారికే దక్కనుంది. బీఆర్‌ఎస్‌ 1, స్వతంత్ర అభ్యర్థి ఒకరు గెలుపొందడంతో వారి బలం అవసరం లేకుండానే కాంగ్రెస్‌ పార్టీ పదవులను సొంతం చేసుకోనుంది. గెలుపొందిన కాంగ్రెస్‌ పార్టీ కౌన్సిలర్లను క్యాంపునకు తరలించారు. క్యాంపు నుంచి నేరుగా సోమవారం వారు మున్సిపల్‌ కార్యాలయానికి రానున్నారు.

నస్రుల్లాబాద్‌: మండలంలోని నస్రుల్లాబాద్‌–లింగంపల్లి రహదారిపై ఆదివారం ద్విచక్ర వాహనం అదుపు తప్పి కిందపడిపోయింది. నస్రుల్లాబాద్‌ నుంచి బైరాపూర్‌ వైపునకు బైక్‌పై వెళ్తున్న ఇద్దరు మూల మలుపు వద్ద బైక్‌ అదుపు తప్పడంతో పొలంలోకి పడిపోయారు.వాహనదారులు పొలంలో పడిన బైక్‌ను బయటకుతీశారు.బైక్‌పై ఉన్న వారికి స్వల్పగాయాలయ్యాయి.

ఇసుక అక్రమ నిల్వల జప్తు

రెంజల్‌: మండలంలోని నీలా శివారులో అక్రమంగా డంప్‌ చేసిన 18 ట్రాక్టర్ల ఇసుక నిల్వలను జప్తు చేసినట్లు తహసీల్దార్‌ శ్రావణ్‌కుమార్‌ తెలిపారు. శనివారం బోధన్‌ మండలం కొప్పెర్గా గ్రామం నుంచి తీసుకొచ్చి రెంజల్‌ మండలం నీలా పెద్ద వాగు వద్ద నిల్వలు చేసినట్లు అందిన సమాచారం మేరకు ఆదివారం రెవెన్యూ సిబ్బంది చేరుకుని పరిశీలించగా అనుమతి లేకుండా ఇసుక నిల్వలు ఉన్నట్లు గుర్తించారని పేర్కొన్నారు. విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లగా స్థానిక ఎస్సై చంద్రమోహన్‌ సిబ్బందితో అక్కడికి చేరుకుని అక్రమంగా నిల్వ చేసిన ఇసుకను రెవెన్యూ కార్యాలయానికి తరలించారని తెలి పారు. మండలంలో అనుమతి లేకుండా ఇసుకను తరలించినా, నిల్వ చేసినా చట్టపరమైన చర్యలు తప్పవని తహసీల్దార్‌ హెచ్చరించారు.

నేడే ఎల్లారెడ్డి మున్సిపల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన1
1/1

నేడే ఎల్లారెడ్డి మున్సిపల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement